కోవిడ్ మరణాల్లో నాలుగో స్థానంలో ఇండియా: 24 లక్షలకు చేరువలో మొత్తం కేసులు

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు దేశంలో రికార్డయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 66,999 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అత్యధికం. దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,96,637కి చేరుకొన్నాయి.

Over 66,000 Coronavirus Cases In India's Highest One-Day Jump

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు దేశంలో రికార్డయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 66,999 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అత్యధికం. దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,96,637కి చేరుకొన్నాయి.

మరో వైపు కరోనా సోకిన రోగుల్లో రికవరీ  శాతం 70.76 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 16,95,982 మంది కరోనా నుండి కోలుకొన్నారు. అంతేకాదు గత 24 గంటల్లో 942 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 47,033కి చేరుకొంది. 

దేశంలోని మహారాష్ట్రలో కరోనా ఉధృతి తగ్గడం లేదు.ఈ రాష్ట్రంలో మొత్తం 5,48,313 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇందులో 1,47, 820 యాక్టివ్ కేసులున్నట్టుగా కేంద్రం గురువారం నాడు ప్రకటించింది.కరోనా సోకిన వారిలో రాష్ట్రంలో ఇప్పటివరకు 13,408 మంది కోలుకున్నారు. బుధవారం నాడు ఒక్క రోజే మహారాష్ట్రలో 12,712 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 18,650 మంది మరణించారు. 

మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. గత 24 గంటల్లో తమిళనాడులో 5871 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు ఒక్క రోజే 119 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 3,14,520 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక కరోనాతో మరణించిన రోగుల సంఖ్యలో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానానికి చేరుకొంది. బ్రిటస్ ను వెనక్కు నెట్టి ఇండియా నాలుగో స్థానానికి చేరుకొంది. కరోనా రోగుల సంఖ్యలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా తర్వాతి స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో ఇండియా కొనసాగుతోంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios