Asianet News TeluguAsianet News Telugu

హర్యానాలో 50 మంది స్కూల్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. రాష్ట్ర మహిళా కమీషన్ సీరియస్..

విద్యార్థినుల ఫిర్యాదులను సెప్టెంబర్ 14న పోలీసులకు పంపామని, అయితే అక్టోబర్ 30న మాత్రమే చర్యలు తీసుకున్నారని.. పోలీసుల ఈ తీరుపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. 

Over 50 schoolgirls were sexually harassed by the principal In Haryana - bsb
Author
First Published Nov 4, 2023, 9:40 AM IST | Last Updated Nov 4, 2023, 9:40 AM IST

చండీగఢ్ : చండీగఢ్ లోని జింద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థినులు తమ ప్రిన్సిపాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రిన్సిపల్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించినా.. ఫిర్యాదులను పట్టించుకోకపోవడంపై హర్యానా రాష్ట్ర మహిళా కమీషన్ పోలీసులను నిలదీసింది.

పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థినుల ఫిర్యాదులను తాము సెప్టెంబర్ 14న పోలీసులకు పంపామని, అయితే అక్టోబర్ 30న మాత్రమే చర్యలు తీసుకున్నారని కమిషన్ తెలిపింది. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై జింద్ పరిపాలన పాఠశాల ప్రిన్సిపాల్‌ ను సస్పెండ్ చేసిన కొన్ని రోజుల తరువాత, హర్యానా పోలీసులు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు.

నేపాల్ లో భారీ భూకంపం, 128 మంది మృతి.. వందలాది మందికి గాయాలు...

నిందితుడిని అరెస్టు చేసేందుకు జింద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ,  55 సంవత్సరాల వయస్సు గల ప్రిన్సిపాల్ దొరకకుండా అరెస్టు నుండి తప్పించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా పంచకులలో విలేకరులతో మాట్లాడుతూ, “ప్రిన్సిపాల్‌పై విద్యార్థినుల నుండి మాకు 60 లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. వీటిలో 50 మంది విద్యార్థినులు నేరుగా ప్రిన్సిపల్ చేతిలో శారీరక వేధింపులకు గురయిన బాలికల ఫిర్యాదులు... కాగా, మరో పది మంది అమ్మాయిలు, తమ ఫిర్యాదులో, ప్రిన్సిపాల్ ఇలాంటివి చేస్తారని తమకు తెలిసని తమ ఫిర్యాదులో తెలిపారు’’ అని ఫిర్యాదు చేసిన వారందరూ మైనర్లని భాటియా తెలిపారు.

నిందితుడు తమను తన కార్యాలయానికి పిలిచి అసభ్యకర చర్యలకు పాల్పడేవాడని బాధితులు ఆరోపించారు. "మొదట్లో కొంతమంది విద్యార్థినుల నుండి సెప్టెంబర్ 13న ఫిర్యాదును స్వీకరించాం. మరునాడు పోలీసులకు ఫార్వార్డ్ చేశాం. సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 29 వరకు, వారి దీనిమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని భాటియా అన్నారు. ఈ విషయంలో జింద్ పోలీసుల విధానాన్ని తప్పు పట్టారు. 

"ఆ అమ్మాయిలు తర్వాత మమ్మల్ని మళ్లీ సంప్రదించారు. దీంతో పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడాం. ఆ తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది" అని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేయకపోవడం వల్ల.. ఇది నిందితుడు పరారీకి అవకాశం ఇచ్చిందని భాటియా ప్రశ్నించారు.

మహిళా జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపించిన ఆరోపణపై కూడా కమిషన్ విచారణ జరుపుతోందని, ఆమె ఫిర్యాదులను స్వీకరించినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని భాటియా చెప్పారు. ప్రిన్సిపాల్‌కు మద్దతిచ్చిన మహిళా ఉపాధ్యాయురాలి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు ఆమె తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని కొందరు బాలికలు ఆరోపిస్తూ  గురువారం సాయంత్రం కమీషన్‌ను సంప్రదించారు. తమ ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆమె తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసేలా చూడాలని హర్యానా డీజీపీ, జింద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌లను కమిషన్ చైర్మన్ కోరారు. అలాంటి వారిని వెంటనే కటకటాల వెనక్కి పంపాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ప్రిన్సిపల్ కొంతమంది అమ్మాయిలకు ఫోన్‌ చేసి పిలిచి వారితో చాట్ చేయడానికి ప్రయత్నించినట్లు కమిషన్ వద్ద రుజువు ఉందని, ఆ ప్రిన్సిల్  కుటుంబానికి లేదా ఇంకెవ్వరికీ తెలియని కనీసం మూడు మొబైల్ ఫోన్‌లను అతని దగ్గర ఉన్నాయని ఎంఎస్ భాటియా చెప్పారు. నిందితుడు పాఠశాలలోని తన ఆఫీసులో లైట్ కలర్ తలుపును ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రిన్సిపాల్‌కు ఇతర పాఠశాలల్లో కూడా మంచి రికార్డు లేదు. భాటియా మాట్లాడుతూ, మరో రెండు పాఠశాలల్లో అతనిపై మహిళా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు ఉన్నాయని ఆమె చెప్పారు.

జింద్ జిల్లాలోని పోలీసులు సోమవారం ప్రిన్సిపాల్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354-ఏ (లైంగిక వేధింపులు), 341 (తప్పుడు నిర్బంధం), 342 (తప్పుగా నిర్బంధించడం), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) కింద కేసు నమోదు చేశారు. చట్టం, పాఠశాల ఎవరి పరిధిలోకి వస్తుందో పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ను హర్యానా ప్రభుత్వం అక్టోబర్ 27న సస్పెండ్ చేసిందని జింద్ జిల్లా పరిపాలన అధికారులు గతంలో తెలిపారు.పాఠశాలకు చెందిన విద్యార్థినుల బృందం ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయానికి, జాతీయ మహిళా కమిషన్‌కు తమ కష్టాలను వివరిస్తూ లేఖలు పంపినట్లు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios