గురుగ్రామ్: గురుగ్రామ్ లోని ఉల్లాస్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గురుగ్రామ్ లోని ఉల్లాస్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద 8 మంది చిక్కుకుపోయినట్లు అనుమానించారు. అయితే, వారి ఆరుగురు మృత్యువాత పడినట్లు తేలింది.

సంఘటన స్థలంలో ఓ బుల్ డోజర్ శిథిలాలను తొలగిస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీని కనిపెట్టడానికి హర్యానా ఫైర్ సర్వీస్ అధికారులు రంగంలోకి దిగారు. 

భవనం కూలడానికి గల కారణమేమిటనేది తెలియడం లేదని సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది అంటున్నారు. ప్రసిద్ధమైన సైబర్ హబ్ కు ఈ భవనం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.