Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : 44 లక్షల డోసుల టీకాలు వృధా !?

టీకాలు ప్రారంభించిన మొదట్లో వేయించుకోవడానికి అనేక అపోహలతో జనాలు ముందుకు రాలేదు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో టీకాల కోసం పోటెత్తుతున్నారు. అయితే చాలా చోట్ల టీకాల కొరత ఏర్పడి.. టీకా సెంటర్లు మూసేస్తున్నారు. 

over 44 lakh vaccine doses wasted in india - bsb
Author
Hyderabad, First Published Apr 20, 2021, 3:17 PM IST

టీకాలు ప్రారంభించిన మొదట్లో వేయించుకోవడానికి అనేక అపోహలతో జనాలు ముందుకు రాలేదు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో టీకాల కోసం పోటెత్తుతున్నారు. అయితే చాలా చోట్ల టీకాల కొరత ఏర్పడి.. టీకా సెంటర్లు మూసేస్తున్నారు. 

యాప్ లో బుక్ చేసుకున్నా డేట్స్ ఇవ్వడం లేదు. మొదటి డోసు వేసుకున్నవారికి రెండో డోసు సమయం దగ్గర పడుతుండడంతో ఉన్న వ్యాక్సిన్ లు వారికి వేయాలని కొత్తవారికి ఇవ్వకుండా ఆపుతున్నారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో 18యేళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనా నుంచి కాపాడే రక్షణ అని ప్రజలూ గట్టిగా నమ్ముతున్నారు. దీంతో టీకాలకు గిరాకీ పెరిగిపోయింది. 

అయితే ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.  పెద్ద సంఖ్యలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. దాదాపుగా ఇప్పటివరకు దేశంలో 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. 

అయితే ఎంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగిందో.. అదే లెవల్లో వ్యాక్సిన్ వృధా కూడా అయ్యింది. దీని మీద కేంద్రం దృష్టి సారించింది. వ్యాక్సిన్ వృధాపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  

వ్యాక్సిన్ వృధా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని ఇప్పటికే సూచించారు. అయితే ఇప్పటికే వృధా అయిన వ్యాక్సిన వివరాలు తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం.. 

ఇప్పటికే దేశంలో 44 లక్షలకు పైగా టీకా డోసులు వృధా అయినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రాలకు 10 కోట్లకు పైగా వ్యాక్సిన్ లను అందించారు. అందులో 44 లక్షల డోసులు వృధా అయ్యాయి. 

తమిళనాడులో అత్యథికంగా 2.10 శాతం వ్యాక్సిన్లు వృధా కాగా, రెండో స్థానంలో హర్యానా, ఆ తరువాత స్థానంలో పంజాబ్, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో 7.55శాతం డోసులు వృధా అయినట్టు అధికారులు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios