Asianet News TeluguAsianet News Telugu

Ahlan Modi: 'వందేమాతరం' ఆలపించిన 35,000 మంది భారతీయులు.. వీడియో చూస్తే గూస్‌బంప్సే!!

Ahlan Modi: అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో ఉద్విగ్నభరిత సంఘటన చోటుచేసుకుంది. ఆ స్టేడియంలో ఉన్న వేలాది మంది భారతీయులు ఒక్కసారి వందేమాతరం ఆలపించడంతో ఒక అద్భుతమైన క్షణం ఆవిష్కృతమైంది. ఈ గూస్‌బంప్‌ తెచ్చే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Over 35,000 Indians sing Vande Mataram at PM Modi's UAE event; video goes viral KRJ
Author
First Published Feb 13, 2024, 11:54 PM IST | Last Updated Feb 13, 2024, 11:54 PM IST

Ahlan Modi: ప్రధాని మోడీ  ప్రస్తుతం యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం అబుదాబీలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో భారతీయ కమ్యూనిటీ నిర్వహించిన ‘Ahlan Modi’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్విగ్నభరిత సంఘటన చోటుచేసుకుంది.

ఒక్క సారిగా 35,000 మందికి పైగా భారతీయులు నిలబడి వందేమాతరం గేయాన్ని లయబద్ధంగా పాడారు. వందే..మాతరం అంటూ దేశభక్తిని ఉప్పొంగించారు. సుప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ఈ దేశభక్తి గీతాన్ని అందరూ చాలా లయబద్ధంగా పాడారు. వేలాది మంది ఒకేసారి గొంతుకలిపి పాటను ఆలపించడంతో స్టేడియమంతా దద్దరిల్లిపోయింది. ఈ వీడియో చూస్తే.. రోమాలు నిక్కబొడుచోకవడం ఖాయం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట్లొ తెగ వైరలవుతోంది.  

ఈ స్మారక సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. UAEలోని భారతీయ సమాజం, వారి మాతృభూమి మధ్య బలమైన బంధం నెలకొందని అన్నారు.  తన కుటుంబ సభ్యులను కలవడానికి ఇక్కడికి వచ్చానని , భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోందని మోడీ అన్నారు. యూఏఈ , భారత్‌లోని నలుమూలల నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చి కొత్త చరిత్ర సృష్టించారని ఆయన పేర్కొన్నారు.   

30 ఏళ్ల తర్వాత యూఏఈలో పర్యటించిన తొలి భారత ప్రధానిని తానేనని ప్రధాని చెప్పారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలకపాత్ర పోషించారని.. యూఏఈ అధ్యక్షుడు గుజరాత్‌కు వచ్చినప్పుడు ఆయనను గౌరవించామని మోడీ గుర్తుచేశారు.

యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం తనకు లభించిందంటే .. అది మీ వల్లేనని ప్రధాని అన్నారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత వృద్ధి చెందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అబుదాబిలో ఆలయాన్ని నిర్మిస్తామని అడిగిన వెంటనే ఒప్పుకున్నామని నరేంద్ర మోడీ తెలిపారు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆలయం కోసం స్థలం ఇస్తామన్నారని పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios