Coronavirus: 15-18 ఏండ్ల వారిలో 3 కోట్ల మందికి అందిన టీకాలు

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ స‌హా ఇత‌ర వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉండ‌టంతో కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచాయి. 15 నుంచి 18 ఏండ్ల లోపు వారిలో ఇప్ప‌టివ‌ర‌కు మూడు కోట్ల మ‌ందికి టీకాలు అందించారు. 
 

Over 3 crore youngsters between the 15-18 age group have received 1st dose of the COVID19

Coronavirus: భార‌త్ లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇత‌ర వేరియంట్ల‌తో పాటు అత్యంత వేగంగా వ్యాపించే కోవిడ్‌-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. వైర‌స్ క‌ట్ట‌డి కోసం కఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్త‌ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు విధించాయి. ఈ నేప‌థ్యంలోనే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా కొనసాగిస్తున్నారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అధికంగా పిల్లలపై ఉంటుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ అందించాడానికి ప్ర‌భుత్వం టీకా కార్య‌క్రాన్ని మొద‌లు పెట్టింది.  ఈ ఏడాది జనవరి 3న 15 నుంచి 18 సంవ‌త్స‌రాల టీనేజర్లకు క‌రోనా వ్యాక్సినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 3 కోట్ల మంది టీనేజర్లు మొదటి డోసు టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ వెల్లడించారు. 

ఇదిలావుండ‌గా, 15 నుంచి 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వారికి టీకాలు అందించ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక క‌రోనా టీకా కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ కోసం దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్యాక్రమాన్ని ప్రారంభించిన మూడు రోజుల్లోనే కోటి మంది టీనేజ‌ర్లు క‌రోనా టీకాలు తీసుకున్నారు. ఇక జనవరి 8 నాటికి ఈ సంఖ్య రెండు కోట్లకు చేరింది. టీనేజ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన ప‌ది రోజుల్లో మూడు కోట్ల మందికి మొద‌టి డోసు అందించారు. వీరికి మొద‌టి  డోసు తీసుకున్న నాలుగు వారాల్లో రెండో డోసు ఇవ్వనున్నారు. ఇదిలావుండ‌గా, మిగ‌తా ఏజ్ గ్రూప్ వారికి సైతం క‌రోనా వ్యాక్సినేష‌న్ల‌ను ముమ్మ‌రంగా అందిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 154.6 కోట్ల కోవిడ్-19 టీకా డోసుల‌ను పంపిణీ చేశారు. అందులో మొద‌టి డోసు తీసుకున్న‌వారు 86.8 కోట్ల మంది ఉన్నారు. ఇక పూర్తి డోసులు (రెండు డోసులు) తీసుకున్న వారి సంఖ్య 64.5 కోట్ల‌కు పెరిగింది. 

 

ఇదిలావుండ‌గా, నిత్యం రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరువ‌గా కొత్త కేసులు న‌మోదుకావ‌డం దేశంలో కోవిడ్‌-19 ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది.  గ‌త  24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,47,417 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత 8 నెలల కాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కొత్త‌గా కరోనాతో 380 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా (Coronavirus) మరణాల సంఖ్య 4,85,035కి చేరింది. దేశవ్యాప్తంగా నిన్న కరోనా నుంచి  84,825 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 3,47,15,361కి చేరింది. రికవరీ రేటు 95.59 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ యంత్రాంగం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్న‌ది. బుధవారం దేశంలో 76,32,024 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కి చేరింది. కరోనా పరీక్షల విషయానికి వస్తే.. జనవరి 12న దేశవ్యాప్తంగా 18,86,935 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా  భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది.  ఇప్పటివరకు మొత్తంగా 69,73,11,627 క‌రోనా (Coronavirus) శాంపిళ్ల‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. 

దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 620 ఒమిక్రాన్ వేరియంట్ (Omicron) కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్పటివ‌ర‌కు దేశంలో ఒమిక్రాన్ బారిన‌ప‌డ్డ‌వారి సంఖ్య  అధికం కావ‌డంతో.. దీని బారిన‌ప‌డ్డ వారి సంఖ్య 5488కి పెరిగింది. కొత్తగా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో అత్యధికం రాజస్థాన్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్రలోనే వెలుగుచూశాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 86, రాజస్థాన్ లో 147, కేరళలో 136, తెలంగాణలో 137 ఒమిక్రాన్ కేసులు మోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios