Asianet News TeluguAsianet News Telugu

అడవి ఏనుగుల బీభత్సం.. గత 8 ఏళ్లలో 3,930 మృత్యువాత..  అగ్రస్థానంలో ఒడిశా.. ఆర్టీఐ నివేదికలో పలు షాకింగ్ నిజాలు

గత ఎనిమిదేళ్లలో అడవి ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన  జాబితాలో ఒడిశా అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2014-2022 మధ్యకాలంలో  మొత్తం 3,900 మంది ప్రాణాలు కోల్పోయారు.
 

Over 3,930 lives lost in wild elephant attacks in last 8 years, Odisha tops list
Author
First Published Jan 11, 2023, 2:55 AM IST

సాధారణంగా ఏనుగులు దారితప్పి అడవి నుంచి జనావాసాలకు వస్తుంటాయి. కొన్ని సార్లు అవి ఆహారం దొరకనప్పుడూ క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి సమయంలో కంటికి ఏది కనిపిస్తే.. దాని మీద దాడి చేస్తుంటాయి. కొన్ని సార్లు మనుషులను కాళ్లతో తొక్కి చంపేస్తుంటాయి కూడా. అలా.. గత ఎనిమిదేండ్లలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారని ఆర్టీఐ యాక్ట్ తో ప్రభుత్వాన్ని అడగ్గా.. భయాభంత్రులకు గురిచేసే.. నిజాలు వెలుగులోకి వచ్చాయి.  

ఆర్టీఐ యాక్ట్ నివేదిక ప్రకారం.. 2014-2022లో అడవి ఏనుగుల దాడిలో దాదాపు 3,930 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఏనుగుల దాడి కారణంగా ఒడిశాలో అత్యధికంగా 719 మంది ప్రాణాలు కోల్పోయారనీ, అన్ని రాష్ట్రాల్లో కంటే ఒడిశాలోనే అత్యధిక మరణాలు సంభవించినట్టు పేర్కొంది. కేరళకు చెందిన ఆర్‌టిఐ ప్రచారకర్త కె గోవిందన్ నంపూతిరి ఆర్‌టిఐ ప్రశ్న మేరకు కేంద్రం ఈ డేటాను విడుదల చేసింది. దేశం వరుస లాక్‌డౌన్‌లను ఎదుర్కొంటున్న 2021-2022 సంవత్సరంలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. 2021-22లో మొత్తం 533 మరణాలు నమోదయ్యాయి, 2020-21లో 461 మరణాలు, 2017-18లో 506 మరణాలు,  2016-17లో 516 మరణాలు నమోదయ్యాయని ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఒడిశాలో ఏనుగుల దాడిలో అత్యధికంగా 719 మరణాలు నమోదయ్యాయనీ, పశ్చిమ బెంగాల్‌లో643 మంది , జార్ఖండ్ (640), అస్సాం (561), ఛత్తీస్‌గఢ్ (477), తమిళనాడు (371),  కర్ణాటక (252) మరణాలు సంభవించామని, కేరళలో ఇదే సమయంలో 158 మంది మరణాలు నమోదయ్యాయి. ఈ ధోరణి ప్రమాదకరమని గోవిందన్ నంపూతిరి అన్నారు. అటవి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని. అధికారులు తగిన శిక్షణ పొంది, మానవ-జంతు సంఘర్షణపై నిర్వాసితులకు సరైన అవగాహన కల్పిస్తే వన్యప్రాణుల మరణాలను అరికట్టవచ్చు. వన్యప్రాణుల ఆవాసాలకు సమీపంలో సాగుభూములు పెరగడం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios