Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాఖండ్ లో 2382మంది పోలీసులకు కరోనా.. రెండు డోసులూ పూర్తయినా...

ఫ్రంట్ లైన్  వారియర్స్ గా సేవలందిస్తున్న పోలీసులకు కరోనా మహమ్మారి మరిన్ని సవాళ్లు విసురుతోంది. ఉత్తరాఖండ్లో తాజాగా 2382మంది పోలీసులకు కొత్తగా పాజిటివ్ గా తేలింది. వీరిలో 93 శాతం మంది రెండు డోసుల టీకా వేయించుకున్నట్లు ఆ రాష్ట్ర డిఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. 

over 2,382 uttarakhand cops covid positive, 93%took both doses of vaccine - bsb
Author
Hyderabad, First Published Jun 3, 2021, 4:11 PM IST

ఫ్రంట్ లైన్  వారియర్స్ గా సేవలందిస్తున్న పోలీసులకు కరోనా మహమ్మారి మరిన్ని సవాళ్లు విసురుతోంది. ఉత్తరాఖండ్లో తాజాగా 2382మంది పోలీసులకు కొత్తగా పాజిటివ్ గా తేలింది. వీరిలో 93 శాతం మంది రెండు డోసుల టీకా వేయించుకున్నట్లు ఆ రాష్ట్ర డిఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. 

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘మిషన్ హౌస్లా’ అనే డ్రైవ్ ను రాస్ట్ర పోలీసు శాఖ గతనెల ప్రారంభించింది. ఇందులో భాగంగా కోవిడ్ బాధితులైన 2,726 మందికి ఆక్సిజన్ సిలిండర్లు, 792 మందికి ఆసుపత్రుల్లో పడకలు, 217 మందికి ప్లాస్మా, రక్తదానం తదితరాలను పోలీసులు అందేలా చేశారు.

17, 609మంది రోగులకు మందులు అందించారు. ఇవే కాకుండా, రేషన్, పాలు, వండిన ఆహారాన్ని అందించడం ద్వారా 94,484మందిని ఆదుకున్నారు. అంబులెన్స్ ల ఏర్పాటు, మృతదేహాల దహనంలోనూ పోలీసులు సహాయం చేస్తున్నారు. కాగా ఈ డ్రైవ్ లో పాల్గొన్న 2382మంది పోలీసుల్లో ఐదుగురితో పాటు వారి కుటుంబసభ్యుల్లో 64మంది వైరస్ కు బలయ్యారు.

విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ప్రాణాలకు తెగించితమ విధులను నిర్వర్తిస్తున్నారని ఎంతోమంది పోలీసులను ప్రశంసిస్తున్నారు. మొదటి దశలో 1982మంది పోలీసులకు వైరస్ సోకగా.. 8 మంది మరణించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లాక్ డౌన్ జూన్ 8వరకు పొడిగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios