ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 1377మందిని స్వదేశానికి తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రస్తుతానికి భారతీయులెవ్వరూ లేరని తెలిపింది.
ఢిల్లీ : కల్లోలిత Ukraineలో చిక్కుకున్న indians తరలింపు ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. నిన్న ఒక్కరోజే 1300 మందికి పైగా పౌరులు స్వదేశానికి తరలించినట్లు విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. రాజధాని Kiev లో ప్రస్తుతం భారతీయులు ఎవరూ లేరని స్పష్టం చేసింది. ‘operation ganga కార్యక్రమం కింద గడచిన 24 గంటల్లో ఆరు విమానాలు భారత్ కు బయలుదేరాయి. నిన్న ఒక్కరోజే 1377 మంది భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తరలించాం’ అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేడు ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను భారత పౌరులందరూ వీడినట్టు విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో మరో 26 విమానాల ద్వారా భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళానికి చెందిన విమానాలను రంగంలోకి దింపింది.
ఈ తెల్లవారుజామున 4 గంటలకు భారత వాయు దళానికి చెందిన సీ-17 విమానం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఉక్రెయిన్లో మానవ సహాయ చర్యల కోసం అవసరమైన సామాగ్రి ఇందులో పంపించారు. తిరుగు ప్రయాణంలో భారత విద్యార్థులను తీసుకురానున్నారు. ఐఏఎఫ్ కు చెందిన అతిపెద్ద రవాణా విమానాలు అయిన ఇవి ఒక్కొక్కటి సుమారు 300 మందిని తరలించగలవు .
ఇదిలా ఉండగా, Ukraine పై రష్యా జరుపుతున్న attackలో భారత విద్యార్థి మృతి చెందడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. karnatakaలోని హవేరి జిల్లాకు చెందిన naveen gowda (21) మరణంపై దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులతో చివరిసారిగా (చనిపోయిన రోజు ఉదయం) మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమతో మాట్లాడినట్లు తండ్రి, తాతయ్యలతో నవీన్ వీడియో కాల్ లో తెలిపాడు. భారతీయులు క్షేమంగా ఉండేలా ఇరుదేశాల అధికారులతో కేంద్రం మాట్లాడిందని మంత్రి చెప్పినట్లు పేర్కొన్నాడు.
‘కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మాట్లాడాము. మమ్మల్ని తరలించడంలో కాస్త సమస్యలు ఏర్పడుతున్నట్లు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలతో భారతప్రభుత్వం మాట్లాడిందని.. భారతీయులకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని ఇరుదేశాలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు’ అని నవీన్ అన్నాడు. ఈ నేపథ్యంలోనే నవీన్ కు తండ్రి పలు సూచనలు చేశారు. ‘మీ వద్ద పెద్ద సైజు త్రివర్ణపతాకం ఉంటే దాన్ని మీరు ఉంటున్న బిల్డింగ్ బయట ఉంచండి. మంత్రి మాకు ఇదే విషయాన్ని వెల్లడించారు’ అని కుమారుడితో తండ్రి చెప్పారు.
Kharkivలోని గవర్నర్ కార్యాలయం పక్కనే ఉన్న అపార్ట్మెంట్లు నవీన్ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఖార్కివ్ లో భయానక పరిస్థితులు నెలకొనడంతో వీరంతా సమీపంలోని Bunkerలోకి వెళ్లారు. అయితే బంకర్ లో నుంచి ఎందుకు రాలేకపోయావు? అనే ప్రశ్నకు.. 2 శాతం మంది మాత్రమే వెళ్లే అవకాశం ఉందని, రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ‘రైళ్ల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఉదయం 6,10 గంటలతో పాటు మధ్యాహ్నం ఒంటిగంటకు రైళ్లు ఉన్నాయి’ అని నవీన్ తండ్రితో అన్నాడు.
