దేశమంతా కరోనా వైరస్ మహమ్మారి వల్ల లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రవాణా మార్గాలు స్తంభించిపోయింది విషయం తెలిసిందే. ఇలా దేశం మొత్తం స్థంబించిపోవడం వల్ల చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. 

తాజాగా మరణించిన ఒక ఆర్మీ అధికారి అంత్యక్రియల కోసం అతని తల్లిదండ్రులు 2600 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి రావలిసి వచ్చింది. దేనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆర్మీ స్పెషల్ ఎంఫోర్స్, అత్యంత ప్రతిష్టాత్మక యూనిట్ గా భావించే పారాట్రూపర్స్ యూనిట్ కి చెందిన ఎన్ఎస్ బల్ ఒక అరుదైన కాన్సర్ వల్ల మరణించాడు. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కల్నల్ నిన్న నవ్వుతు వీడియో లో కనిపించాడు. కానీ తెల్లారేసరికి మృత్యు ఒడిలోకి జారుకున్నాడు. 

కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు ఆర్మీ విమానంలో అమృత్సర్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు అనుమతించాలని కోరినప్పటికీ ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించలేదు. శౌర్య చక్ర పతాకం పొందిన ఇంతటి గొప్ప ఆఫీసర్ మరణిస్తే అతడి తల్లిదండ్రులను ఈ కష్టకాలంలో కూడా ఆర్మీ విమానాల్లో ప్రయాణించడానికి అనుమతి నిరాకరించడంపై ఆర్మీ ఉద్యోగులు సీరియపుస్ అవుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఈ విషయాన్నీ తీవ్రంగా ఖండించారు. 

మరణించిన ఆర్మీ ఆఫీసర్ సోదరుడు ఆక్రోశంతో ఆర్మీ చీఫ్ కి ట్విట్టర్ వేదికగా మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, రేపు రాత్రికల్లా బెంగళూరు చేరుకుంటాం అని రాసుకొచ్చాడు. 

ఇందుకు బదులిస్తూ ఆర్మీ చీఫ్ తన నిస్సహాయతను వ్యక్తం చేసాడు. రూల్స్ రాళ్ళ మీద రాయలేదని, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వాటిలో మార్పులు చేయవచ్చని తెలిపారు. 

ప్రభుత్వ వర్గాలు మాత్రం మరణించిన ఆర్మీ, పోలీసు అధికారుల కుటుంబాలకు రక్షణ విమానాల్లో ప్రయాణించడానికి అనుమతి ఇవ్వలేమని, రక్షణ శాఖకు చెందిన విమానాల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ రూల్స్ పెట్టినట్టు తెలిపారు.