న్యూఢిల్లీ: స్వలింగ జంటల వివాహానికి కేంద్రం అనుమతివ్వలేమని చెప్పింది. గతవారం రోజుల క్రితం నలుగురు సభ్యులు ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

లెస్బియన్ల, గే, బైసెక్సువల్,ట్రాన్స్ జెండర్, ఇంటర్ సెక్స్   (ఎల్జీబీటీఐ )కమ్యూనిటీ సభ్యులు హిందూ వివాహా చట్టం 1955 ప్రకారంగా వివాహానికి అనుమతి ఇవ్వాలని గత వారంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వివాహాలు మన సమాజంలో ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్దంగా నడుస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.ఈ వివాహాలను మన విలువలను గుర్తించవని కేంద్రం అభిప్రాయపడింది. స్వలింగ జంటల మధ్య వివాహాన్ని చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం, మన విలువలు గుర్తించవని కేంద్రం తెలిపింది. 

హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ముందు సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా హాజరయ్యారు.

స్వలింగ జంటల మధ్య వివాహాలను, చట్టాలు, సమాజం, న్యాయవ్యవస్థ గుర్తించవని ఆయన అభిప్రాయపడ్డారు.హిందూ వివాహ చట్టంలో వివాహాల నియంత్రణ, వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు భార్యాభర్తల గురించి ప్రస్తావన ఉన్న విషయాన్ని మోహతా ప్రస్తావించారు. 

స్వలింగ జంటల వివాహాలు ఇప్పటికీ సాధ్యం కావడం లేదని పిటిషనర్ వాదించారు. ఇక స్వలింగ వివాహాన్ని రిజిస్టర్ చేసేందుకు నిరాకరణకు గురైన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభిజిత్ అయ్యర్ మిత్రాను కోర్టు కోరింది.