Asianet News TeluguAsianet News Telugu

ఉక్రెయిన్ నుంచి మా విద్యార్థుల ర‌క్షించారు.. మోడీ మోడీ చొర‌వకు ధ‌న్య‌వాదాలు - బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా

భారత్ తమకు మిత్ర దేశం అని, అనేక సందర్భాల్లో తమ దేశానికి అండగా నిలిచిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ దేశ విద్యార్థులను రక్షించిన ప్రధాని మోడీ చొరవ అభినందనీయం అని ఆమె తెలిపారు. 

Our students were saved from Ukraine..Thanks to Modi Modi's initiative - Bangladesh Prime Minister Sheikh Hasina
Author
First Published Sep 4, 2022, 2:42 PM IST

ఉక్రెయిన్ లో చిక్కుకున్న త‌మ దేశ విద్యార్థుల‌ను రక్షించేందుకు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర చొర‌వ తీసుకున్నార‌ని, ఈ చ‌ర్య ప్ర‌శంస‌నీయ‌మ‌ని బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా అన్నారు. సోమవారం భారత్ లో పర్యటించనున్న ప్రధాని హసీనా ‘ఏఎన్ఐ’తో ఫ్రీ-వీలింగ్ టెలివిజన్ ఇంటరాక్షన్ లో మాట్లాడారు. క‌రోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద పొరుగు దేశాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించాలనే మోడీ ప్రభుత్వ తీరు కొనియాడారు. 

గుజ‌రాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా పై ఎఫ్ఐఆర్ న‌మోదు.. ఎందుకంటే?

బంగ్లాదేశ్, భార‌త్ దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని షేక్ హ‌సీనా నొక్కి చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య విభేదాలు ఉండ‌వ‌చ్చ‌ని కానీ వాటిని చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో భారత్, బంగ్లాదేశ్ లు ఆ ప‌ని చేశాయ‌ని తెలిపారు. ‘‘ రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగిన ఈ యుద్ధ సమయంలో మా విద్యార్థుల్లో చాలా మంది చిక్కుకుపోయారు. వారు ఆశ్రయం కోసం పోలాండ్ కు తీసుకొచ్చినందుకు నేను ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. కానీ మీరు (ప్రధాని మోడీ) మీ విద్యార్థులను తరలించినప్పుడు మా విద్యార్థులను కూడా ఇంటికి తీసుకువచ్చారు. మీరు నిజంగా, స్పష్టంగా స్నేహపూర్వక సంజ్ఞలను చూపించారు. ఈ చొరవకు ప్రధానికి ధన్యవాదాలు ’’ అని హసీనా పేర్కొన్నారు. 

సార్క్ దేశాల మధ్య సహకారం లోపించిందని పాశ్చాత్య పరిశీలకులు తరచుగా చేసిన వ్యాఖ్యలపై, అలాగే భారత ప్రభుత్వం చేపట్టిన టీకా మైత్రి కార్య‌క్ర‌మంపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘‘ ప్రధాని మోడీ చొరవకు నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయ‌న బంగ్లాదేశ్ కు మాత్ర‌మే కాకుండా కొన్ని దక్షిణాసియా దేశాలకు కూడా వ్యాక్సిన్లు అందించారు. ఇది వివేకవంతమైన చొరవ. మేము మా సొంత డ‌బ్బుతో వ్యాక్సిన్లను కొనుగోలు చేశాం. అలాగే అనేక ఇతర దేశాలు కూడా సహకరించాయి ’’ అని హసీనా పేర్కొన్నారు.

జార్ఖండ్ లో ఘోరం.. గిరిజన బాలిక‌ను రేప్ చేసి, చెట్టుకు ఉరేసిన దుండ‌గుడు..

హసీనా బంగ్లాదేశ్ లో వ్యాక్సినేషన్ వివరాలను కూడా తెలియజేశారు. తమ దేశ జనాభాలో 90 శాతం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందాయని చెప్పారు. ‘‘ సాధారణంగా మా దేశంలో గ్రామాల్లో కొంద‌రు ప‌ట్ట‌ణాల్లో ఉండే ప్ర‌జ‌లు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా విముఖత చూపారు.కానీ మేము వారికి న‌చ్చ‌జెప్పాం. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్ర‌మాద‌మూ ఉండ‌ద‌ని, అది మీ ప్రాణాల‌ను కాపాడుతుంద‌ని చెప్పాం. దీని వ‌ల్ల ఎక్కువ మందికి టీకా అందించ‌గ‌లిగాం. ’’ అని అన్నారు. 

భారత్ తమకు మిత్రదేశం అని హసీనా అన్నారు. బంగ్లాదేశ్ కు అవసరమైనప్పుడల్లా భారత్ అండగా నిలుస్తోందని చెప్పారు. ‘‘ 1971లో జరిగిన యుద్ధ సమయంలో భారత్ అందించిన సేవలను మేం ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. 1975 లో కూడా మేం మా కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినప్పుడు అప్ప‌టి ప్ర‌ధాని ఆమె భారత్ లో ఆశ్ర‌యం ఇచ్చింది.  మేము పొరుగుదేశాల‌తో స్నేహానికి ఎప్పుడూ ప్రాముఖ్య‌త‌ను ఇస్తాను ’’ అని అన్నారు. 

ధరల పెరుగుదల.. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌ట్ట‌ని ప్ర‌ధాని.. : రాహుల్ గాంధీ

కోవిడ్ -19 కాలంలో కూడా భారత నాయకత్వం పాజిటివ్ సంకేతాలను చూపిందని, అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ బంగ్లాదేశ్ లో స్వాతంత్ర దినోత్సవాన్ని జరపుకున్నారని హసీనా గుర్తు చేశారు. ‘‘ ప్రధాని మోదీకి, రాష్ట్రపతికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జాతిపిత శతజయంతి, మా 50 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పుడు వారిద్దరూ బంగ్లాదేశ్ ను సందర్శించారు. ఆ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో కోవిడ్ విజృంభిస్తోంది. కానీ వారిద్దరూ మమ్మల్ని, మా ప్రజలను గౌరవించారు ’’ అని ఆమె పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios