Asianet News TeluguAsianet News Telugu

వంశపారంపర్య పార్టీలు ప్రజాస్వామ్యానికి చేటు: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మోడీ

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సెంట్రల్ హల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.

Our Constitution binds our diverse country, says PM Modi in Parliament
Author
New Delhi, First Published Nov 26, 2021, 11:42 AM IST

న్యూఢిల్లీ: వంశపారంపర్య పార్టీలు ప్రజాస్వామ్యానికి ఎప్పటికీ విఘాతమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచే ప్రయత్నం జరిగిందన్నారు.రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సెంట్రల్ హల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.  మనమంతా ఇక్కడ ఉన్నామంటే రాజ్యాంగ ఫలితమేనని ఆయన గుర్తు చేశారు.మన రాజ్యాంగం  అనేక అవాంతరాల మధ్య రూపొందిందన్నారు. దేశంలోని రాచరిక రాష్ట్రాలను  ఏకం చేసిందని మోడీ తెలిపారు.26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని మోడీ తన ప్రసంగంలో నివాళులర్పించారు.ఉగ్రదాడిలో ప్రాణాలు పోగోట్టుకొన్న సైనికులందరికి నివాళులర్పిస్తున్నానని ప్రధాని Narendra Modi  తెలిపారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

also read:Constitution Day : రాష్ట్రపతి నేతృత్వంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

ఇవాళ  బాబా సాహెబ్ అంబేద్కర్ రాజేంద్రప్రసాద్  వంటి చిరకాల దృష్టిగల మహానుభావులకు నివాళులర్పించే రోజుగా ఆయన పేర్కొన్నారు. మనం రాజ్యాంగాన్ని అక్షర బద్దంగా,స్పూర్తిని పాటిస్తున్నామా అనే విషయాన్ని ప్రశ్నించుకోవాలని  ప్రధాని చెప్పారు. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటీ, దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగంలోని పొందుపర్చిన అంశాల్లో ఒక్క పేజీనైనా అనుసరిస్తున్నామో ప్రతి ఒక్కరూ  ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా 14 పార్టీలు బహిష్కరించాయి. మిగిలిన పార్టీల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక తేదీ యొక్క ప్రాముఖ్యతకు తగిన గుర్తింపును ఇవ్వాలని ప్రధాని 2015లో రాజ్యాంగ దినోత్సవాన్ని  పాటించడం ప్రారంభించారు.

2010లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మోడీ  నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ యాత్రలో కూడా ఇదే తరహ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు.భారత స్వాతంత్ర్యం కోసం  పోరాడిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్టుగా మోడీ చెప్పారు. విభిన్న సంస్కృతులతో అలరారుతున్న ఇండియాను ఈ రాజ్యాంగం ఒక్కటిగా నిలిపి ఉంచిందన్నాారు. రాజ్యాంగాన్ని అర్ధం చేసుకోకపోతే  ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కష్టమనే అభప్రాయాన్ని ఆయన  వ్యక్తం చేశారు.అవినీతిని రాజ్యాంగం అనుమతించదన్నారు. కాంగ్రెస్  సహా 14 విపక్ష పార్టీలు  ఈ రాజ్యాంగ దినోత్సవానికి డుమ్మా కొట్టాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  విపక్షాలు ఐక్యతగా ఉన్నాయని ఈ ఘటన సూచిస్తోందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన రాజ్యాంగం కేవలం అనేక అధికరణల సమాహారం మాత్రమే కాదని, వేలాది సంవత్సరాల సమున్నత సంప్రదాయమని చెప్పారు. . రాజ్యాంగ దినోత్సవాల నిర్వహణ ఏదో ఓ ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి లేదా ప్రధాన మంత్రికి సంబంధించిన విషయం కాదన్నారు. స్పీకర్, రాజ్యాంగం, డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్‌లను గౌరవించుకోవడమని చెప్పారు.

 రాజ్యసభలో పని గంటల సమయం తగ్గడంపై వెం వెంకయ్య ఆందోళన

భారత దేశాన్ని ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా తిర్చిదిద్దేందుకు ప్రజలు ఇష్టపడే రాజ్యాంగంోని దార్శనికత గురించి ఆయన వివరించారు.  రాజ్యసభ 254 సెషన్ లో  పని గంటల సమయం తగ్గడంపై ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ 70 శాతం క్రియాత్మక సమయాన్ని కోల్పోయిందన్నారు. 


 

 

Follow Us:
Download App:
  • android
  • ios