Asianet News TeluguAsianet News Telugu

పేగు సంబంధిత వ్యాధితో వస్తే.. అవయవాలు కొట్టేసి, ప్లాస్టిక్ కవర్లు కుక్కిన డాక్టర్లు.. మైనర్ బాలిక మృతి..

పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 15 ఏళ్ల బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె అవయవాలు తొలగించారు. దీంతో ఆమె రెండు రోజుల తర్వాత చనిపోయింది. 

organs stolen from minor girl during surgery and body 'stuffed' with plastic covers In Delhi - bsb
Author
First Published Feb 1, 2023, 1:21 PM IST

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలిక అవయవాలను తొలగించి, పాలిథిన్ బ్యాగులతో ఆమె శరీరాన్ని నింపడంతో ఆమె చనిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనిపై బాలిక కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి శవపరీక్ష నిర్వహించనున్నామని, దీని తరువాతే ఈ ఆరోపణలు నిజమో కాదో తేలుతుందని పోలీసులు తెలిపారు. 

పదిహేనేళ్ల బాలిక పేగు సంబంధిత వ్యాధితో జనవరి 21న ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు జనవరి 24న ఆపరేషన్ చేశారు. ఆ తరువాత జనవరి 26న బాలిక మరణించింది. దీనిమీద డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) (నార్త్) సాగర్ సింగ్ కల్సి మాట్లాడుతూ.. మొదట బాలిక కుటుంబం ఎటువంటి ఫిర్యాదు లేకుండా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది. అయితే, ఆ తరువాత వారికి బాలిక అవయవాలను తొలగించి ఉండొచ్చని అనుమానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 

ఆన్‌లైన్ క్లాస్‌ చెబుతుండగానే టీచర్ దారుణ హత్య.. జూమ్ సెషన్ లో ఘటన రికార్డ్

మృతురాలి అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేశారని కల్సి చెప్పారు. "ఫిర్యాదు మేరకు, మృతదేహాన్ని స్థానిక పోలీసు బృందం కస్టడీలోకి తీసుకుంది. ఉస్మాన్‌పూర్ పోలీసులు జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రిలో మెడికో-లీగల్ కేసును సిద్ధం చేశారు. అయితే, అలాంటిదేమీ ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని ఇప్పుడు గురు వద్ద, తేగ్ బహదూర్ ఆసుపత్రిలో ఉంచారు. " అని డిసిపి కల్సి పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.

15 ఏళ్ల బాలిక జనవరి 26న ఎంసీడీ ఆధ్వర్యంలో నడిచే హిందూ రావ్ ఆసుపత్రిలో మరణించినట్లు నివేదించబడింది. ఇదిలా ఉండగా, బాలిక శవపరీక్ష నిర్వహించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు.బాలిక తన కడుపులో కొన్ని రంధ్రాలను ఉటంకిస్తూ అవయవాలను తీసివేసినట్లు పేర్కొంది. ఆ రంధ్రాలను పాలిథిన్ సంచులతో నింపినట్లు ఆరోపించిందని మరో నివేదిక పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios