బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి చేసిన అవయవదానం వల్ల ఇద్దరు సైనికులతో సహా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ఈ ఘటన పూణెలో జరిగింది. 

పుణె : అవయవదానం ఐదు ప్రాణాలను కాపాడింది. బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ యువతి అవయవదానం చేయడంతో పూణేలోని కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ (సిహెచ్‌ఎస్‌సి)లో పనిచేస్తున్న ఇద్దరు ఆర్మీ సైనికులతో సహా ఐదుగురి ప్రాణాలు రక్షించబడ్డాయి. ఓ యువతిని ఆమె చివరిక్షణాల్లో కమాండ్ హాస్పిటల్ (సదరన్ కమాండ్), (CHSC)కి తీసుకువచ్చారు. ఒక ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అడ్మిట్ అయినప్పుడు, ఆమె మెదడులో ఎలాంటి జీవం లేదు. ఆ యువతి కుటుంబానికి అవయవదానం మీద అవగాహన ఉంది. దీంతో హాస్పిటల్ లోని కొందరు అవయవదాన సమన్వయకర్తలు వారితో చర్చించారు. దీంతో వారు తమ కూతురి అవయవాలను అత్యంత అవసరమైన వారికి దానం చేయడానికి ఒప్పుకున్నారు... అని డిఫెన్స్ PRO తెలిపారు.

అవయవదానం చేయగానే సరికాదు.. దానికి సరైన అనుమతులు.. ట్రాన్స్ ప్లాంటేషన్ కు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాటన్నింటిని అధిగమించి "అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత, కమాండ్ హాస్పిటల్ (సదరన్ కమాండ్)లోని ట్రాన్స్‌ప్లాంట్ టీమ్ వెంటనే యాక్టివేట్ చేయబడింది. జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్, ఆర్మీ ఆర్గాన్ రిట్రీవల్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ అథారిటీ (AORTA)కి కూడా హెచ్చరికలు పంపించాం" అని డిఫెన్స్ తెలిపింది. 

పిల్లలు 7 గంటలకే స్కూల్‌కు వెళ్లుతున్నప్పుడు.. మనమెందుకు 9 గంటలకే సుప్రీంకోర్టుకు రావొద్దు: జస్టిస్ లలిత్

అలా జూలై, 14 రాత్రి, జూలై 15 తెల్లవారుజామున, కిడ్నీలు వంటి పనిచేస్తున్న అవయవాలను భారత సైన్యంలోని ఇద్దరు సైనికులకు మార్పిడి చేశారు, CH(SC)-సాయుధ దళాల మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్ఐ బ్యాంక్ లో కళ్ళు భద్రపరిచారు. పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో ఒక రోగికి కాలేయం ఇచ్చారు.

మరణం తర్వాత అవయవ దానం అనేది చాలా కరుణతో కూడిన విషయం అని, అవయవదాన కార్యకర్తలు, యువతి తల్లిదండ్రుల సమన్వయంతో చేసిన ప్రయత్నం ఐదుగురు తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు జీవితాన్ని, కంటి చూపును అందించింది. ‘మరణం తరువాత మీ అవయవాలను స్వర్గానికి తీసుకెళ్లకండి, అక్కడ వాటా అవసరం లేదు.. భూమి మీదే అవి అవసరమని దేవునికి తెలుసు’ ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు అవయవ దానం విశిష్టతను గురించిన విస్తృత అవగాహన కల్పిస్తాయని డిఫెన్స్ తెలిపింది.