Asianet News TeluguAsianet News Telugu

ప్రతిపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలి.. మండిపడ్డ కేంద్రమంతులు...

మంగళవారం నాడు కొందరు విపక్ష ఎంపీలు రాజ్యసభలో టేబుల్ పైకి ఎక్కి ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అయ్యారని, ఆ వీడియోలను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషి అన్నారు.  పార్లమెంట్ సజావుగా సాగనీయకూడదని ముందస్తుగానే కాంగ్రెస్,  దాని మిత్రపక్షాలు నిర్ణయించుకున్నాయి అని ఆరోపించారు.

Opposition should apologise to nation for their behaviour in Parliament: Ministers
Author
Hyderabad, First Published Aug 12, 2021, 4:15 PM IST

వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏడుగురు కేంద్ర మంత్రులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంటును సజావుగా సాగనివ్వకుండా ఆటంకం సృష్టించడం, బెదిరింపు ధోరణులతో వ్యవహరించినందుకు ప్రతిపక్షం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి చేయించారన్న విపక్ష నేతల ఆరోపణలను కొట్టిపారేశారు. 

ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయని,  పార్లమెంటులోకి బయటి వారిని ఎవరిని అనుమతించలేదని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.  మంగళవారం నాడు కొందరు విపక్ష ఎంపీలు రాజ్యసభలో టేబుల్ పైకి ఎక్కి ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అయ్యారని, ఆ వీడియోలను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషి అన్నారు.  పార్లమెంట్ సజావుగా సాగనీయకూడదని ముందస్తుగానే కాంగ్రెస్,  దాని మిత్రపక్షాలు నిర్ణయించుకున్నాయి అని ఆరోపించారు.

 నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిపక్ష ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ డిమాండ్ చేశారు. ఈ తరహా ప్రవర్తన పార్లమెంట్ పార్లమెంటేరియన్ లకు సమంజసం కాదని కేంద్ర మంత్రి  పియుష్ గోయల్ మండిపడ్డారు.  సభలో ఫర్నిచర్, తలుపులు విరగొట్టడం,  ప్రకటన చేస్తున్న మంత్రుల నుంచి పేపర్లు లాక్కుని చింపేయడం, మార్షల్స్ పై చేయి చేసుకోవడం వంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదన్నారు.

 ఇది యావత్ దేశానికే సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.  మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్ష పార్లమెంటరీ  ప్రజాస్వామ్యాన్ని మరి ఇంత దిగజార్చేలా ఉందన్నారు.  దేశ ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో వ్యవహరించిన తీరుకు దేశ ప్రజలకు ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.

 వీధుల నుంచి పార్లమెంటు దాకా అరాచకం సృష్టించడమే విపక్షాలు అజెండాగా పెట్టుకున్నాయని మండిపడ్డారు.  తమ సమస్యల్ని పార్లమెంటులో  లేవనెత్తుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారని, కానీ అవేవీ విపక్షానికి పట్టడంలేదని దుయ్యబట్టారు.  మొసలి కన్నీరు కార్చడానికి బదులుగా  కి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios