రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ PC Mody సిన్హా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ PC Mody సిన్హా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ బెనర్జీ, జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఫరూక్‌ అబ్దుల్లా, ఆర్‌ఎల్‌డీకి చెందిన జయంత్‌ సిన్హా, సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి, తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తదితరులు.. యశ్వంత్ సిన్మా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.