న్యూఢిల్లీ: రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని రాష్ట్రపతిని విపక్షనేతలు కోరారు.బుధవారం నాడు సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను పలు పార్టీల నేతలు కలిశారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్,డీఎంకే నేతలు ఇవాళ రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

కేంద్ర ప్రతిపాదనలకు నో: బీజేపీ ఆఫీస్‌ల ముట్టడికి రైతు సంఘాల పిలుపు also read:

14 రోజులుగా రైతులు న్యూఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని వారు రాష్ట్రపతిని కోరారు.రాష్ట్రపతిని కలిసిన తర్వాత రాష్ట్రపతి భవన్   వెలుపల నేతలు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంపై రైతులు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం చెప్పే మాటలను రైతులు వినే స్థితిలో లేరని ఆయన చెప్పారు.పరిస్థితి తీవ్రతను రాష్ట్రపతికి వివరించామని రాహుల్ గాంధీ తెలిపారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన చట్ట సవరణలకు కూడ రైతు సంఘాలు మాత్రం వ్యతిరేకించాయి. ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రకటించాయి.