కల్లోలిత మణిపూర్‌లో 20 మందితో కూడిన విపక్ష ఎంపీల కూటమి పర్యటించనుంది. ఈ మేరకు 20 మంది ఎంపీల జాబితాను విడుదల చేశారు. ఈ బృందం రెండు రోజుల పాటు మణిపూర్‌లో పర్యటించనుంది.
మణిపూర్ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రధానంగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జాతీయంగా, అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించిందని విపక్షాల మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మణిపూర్ విపక్ష ‘‘ఇండియా’’ కూటమి నేతలు సిద్ధమయ్యారు. జూలై 29న ఉదయం 20 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం విమానంలో మణిపూర్ బయల్దేరి వెళ్లనుంది. రెండు రోజుల పాటు ఎంపీల బృందం అక్కడ పర్యటించనుంది. పర్యటనలో భాగంగా జూలై 30న మణిపూర్ గవర్నర్‌ను విపక్ష ఎంపీల బృందం కలవనున్నారు. ఈ మేరకు మణిపూర్ వెళ్లే ఎంపీల వివరాలను ఇండియా కూటమి ప్రకటించింది.
- అధిర్ రంజన్ చౌధురి( కాంగ్రెస్)
- తిరుమవలన్ (వీసీకే)
- జయంత్‌సింగ్ (ఆర్‌ఎల్‌డీ)
- ఫూలో దేవి నేతం (కాంగ్రెస్)
- జావేద్ అలీ ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ)
- మహువా మజి( జేఎంఎం)
- పి.పి.మహ్మద్ ఫైజల్ (ఎన్సీపీ)
- అనిల్ ప్రసాద్ హెగ్డే (జేడీయూ)
- గౌరవ్ గగోయ్ (కాంగ్రెస్)
- రాజీవ్ రంజన్ (లలన్)సింగ్ (జేడీయూ)
- ఈ.టీ. మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్)
- ఎన్.కె.ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్పీ)
- సుశీల్ గుప్తా (ఆప్)
- అర్వింద్ సావంత్ (శివసేన-యూబీటీ)
- డి.రవి కుమార్ (వీసీకే)
- సుస్మితా దేవ్ (తృణమూల్ కాంగ్రెస్)
- కణిమొళి (డీఎంకే)
- సంతోష్ కుమార్ (సీపీఐ)
- ఎ.ఎ.రహీం (సీపీఎం)
- మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ)
