స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడాన్ని కేంద్రం వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలో ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కేంద్రం వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. స్వలింగ సంపర్కులు , భిన్న లింగ సంబంధాలు వేర్వేరు వర్గాలుగా ఉన్నాయని, వాటిని ఒకేలా పరిగణించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇటీవలి నెలల్లో, నాలుగు స్వలింగ జంటలు స్వలింగ వివాహాలను గుర్తించాలని కోర్టును కోరాయి. 

పిటిషన్లను కొట్టివేయాలి - కేంద్రం

అఫిడవిట్‌లో కేంద్రం ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. స్వలింగ సంపర్కులకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్‌లలో ఎటువంటి అర్హత లేనందున వాటిని కొట్టివేయాలని పేర్కొంది. LGBTQ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ వచ్చిన పిటిషన్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం తన వైఖరిని వెల్లడింది. స్వలింగ సంబంధాలు,భిన్న లింగ సంబంధాలను సమానంగా పరిగణించలేమని తెలిపింది. 

మన దేశంలో అమల్లో ఉన్న చట్టాల్లో ఈ అంశంపై సానుకూల ప్రతిపాదనలు లేవని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొన్నది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) సెక్షన్‌ 377 ప్రకారం.. మనదేశంలో స్వలింగ సంపర్కాలు, స్వలింగ వివాహాలు నిషేధమనీ, ఈ సెక్షన్‌ను ఎత్తివేసి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ చట్టం న్యాయశాస్త్రంలో ఎలాంటి ఆధారం లేకుండా పాశ్చాత్య తీర్పులను దిగుమతి చేసుకోలేమని కేంద్రం తెలిపింది.

అటువంటి సామాజిక నైతికత , భారతీయ తత్వాల ఆధారంగా ప్రజల ఆమోదాన్ని నిర్ధారించడం, అమలు చేయడం శాసనసభ యొక్క పని అని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. స్వలింగ సంపర్కులు భాగస్వాములుగా సహజీవనం చేయడం, ఇప్పుడు నేరంగా పరిగణించబడడం లేదని, కానీ, దీనిని భర్త, భార్య, పిల్లలతో కూడిన భారతీయ కుటుంబంతో సమానంగా గుర్తించడం వీలు కాదని అఫిడవిట్‌లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రాథమిక హక్కును పొడిగించడం సాధ్యం కాదనీ, ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కు చట్టం ద్వారా స్థాపించబడిన విధానానికి లోబడి ఉంటుందని , దేశ చట్టాల ప్రకారం స్వలింగ వివాహానికి సంబంధించిన ప్రాథమిక హక్కుగా గుర్తించబడేలా దీన్ని విస్తరించలేమని కేంద్రం చెబుతోంది.

వాస్తవికతకు విరుద్ధమని పేర్కొంది. అలాగే పిటిషనర్లు ప్రాథమిక హక్కులను పొందలేరనీ, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను నేరరహితం చేసినప్పటికీ, దేశంలోని చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తించే ప్రాథమిక హక్కును పిటిషనర్లు పొందలేరని కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై సోమవారం కోర్టు విచారణ జరుపనున్నది. దీనిపై కేంద్రం అభిప్రాయాన్ని కోరటంతో స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

విషయం ఏమిటి?

ఢిల్లీ హైకోర్టుతో సహా దేశంలోని అన్ని హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న స్వలింగ వివాహాలకు సంబంధించిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసింది. కేంద్రం తరఫు న్యాయవాది, పిటిషనర్ల తరఫు న్యాయవాది అరుంధతీ కట్జూ కలిసి వ్రాతపూర్వక సమాచారం, పత్రాలు, పాత పూర్వాపరాలను సేకరిస్తారని, వాటి ఆధారంగా విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. బెంచ్, జనవరి 6 నాటి తన ఆదేశాలలో, పార్టీలు ఫిర్యాదుల సాఫ్ట్ కాపీని (డిజిటల్ కాపీ) పంచుకోవాలి . అదే విధంగా కోర్టుకు కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. 

అన్ని పిటిషన్‌లను ఒకదానితో ఒకటి జాబితా చేసి, విషయాలలో సూచన కోసం మార్చి 13, 2023 తేదీని నిర్ణయించారు. వివిధ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ విషయంలో అధికారిక నిర్ణయం కోసం అన్ని విషయాలను తనకు బదిలీ చేయాలని , సుప్రీం కోర్టులో కేంద్రం తన సమాధానం దాఖలు చేయాలని బెంచ్‌ను అభ్యర్థించారు. స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రెండు పిటిషన్‌ల బదిలీకి సంబంధించి కోర్టు డిసెంబర్ 14, 2022న కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన కోరింది.