Operation Kaveri: సూడాన్ సంక్షోభం నేపత్యంలో భారత్ ఆపరేషన్ కావేరిని ప్రారంభించింది. దీనిలో భాగంగా సుడాన్ నుండి 600 మంది ప్రవాసులను సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చారు. 3500 మంది భారతీయులు ఇప్పటికీ అక్కడ చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Operation Kaveri: సూడాన్ లో అంతర్యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు భారత సైన్యం సాయంతో ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సూడాన్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులను 'ఆపరేషన్ కావేరి' కింద భారత్ కు తీసుకొస్తున్నారు. ఈ ఆపరేషన్ కింద ఇప్పటివరకు ఎంత మంది భారతీయులను తమ దేశానికి తీసుకొచ్చారనే వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. సూడాన్ సంక్షోభం నేపత్యంలో భారత్ ఆపరేషన్ కావేరిని ప్రారంభించింది. దీనిలో భాగంగా సుడాన్ నుండి 600 మంది ప్రవాసులను సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చారు. 3500 మంది భారతీయులు ఇప్పటికీ అక్కడ చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
సూడాన్ లో చిక్కుకున్న 3,500 మంది భారతీయులు
ఏప్రిల్ 15న ఘర్షణలు మొదలైనప్పటి నుంచి సూడాన్ లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా మీడియా సమావేశంలో చెప్పారు. సూడాన్ లో సుమారు 3500 మంది భారతీయులు, 1000 భారత సంతతికి చెందిన వారు ఉన్నారని వివరాలు తమకు అందాయని తెలిపారు.
సూడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు మూడో నౌకాదళ నౌక ఐఎన్ఎస్ తర్కాష్ గురువారం సూడాన్ పోర్టుకు చేరుకుందని వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు.
ప్రధాని మోడీ ప్రత్యేక సూచనలు
భారతీయుల తరలింపు గురించి అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. "ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రస్తుత వివరాలను సమీక్షించి, సూడాన్ లో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు" అని వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. దాదాపు 600 మంది ఇండియాకు వచ్చారు తెలిపిన ఆయన... 246 మందిని మహారాష్ట్రకు పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతర దేశాల పౌరుల తరలింపు సహా పలు అభ్యర్థనలు భారత్ కు అందాయని విదేశాంగ కార్యదర్శి తెలిపారు.
