Operation Kaveri: సూడాన్ అంతర్గత ఘర్షణల నేపథ్యంలో భారత్ ఆపరేషన్ కావేరిని చేపట్టింది. దీనిలో భాగంగా 278 మంది భారతీయులతో ఐఎన్ఎస్ సుమేధ సూడాన్ పోర్టు నుంచి జెడ్డాకు బయలుదేరింది. సూడాన్ సంక్షోభం నేపథ్యంలో ఆపరేషన్ కావేరి కింద అక్కడ చిక్కుకున్న భారతీయుల మొదటి బ్యాచ్ ను మంగళవారం తరలించినట్టు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Sudan Violence-Operation Kaveri: సూడాన్ లో ఘర్షణలు మరింతగా ముదురుతున్నాయి. ఇరు వర్గాల మధ్య కొనసాతుతున్న కాల్పుల కారణంగా ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భారత్.. అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఆపరేషన్ కావేరిలో భాగంగా భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్ ను భారత్ కు మంగళవారం తీసుకువస్తుంది.
వివరాల్లోకెళ్తే.. ఆపరేషన్ కావేరి కింద సూడాన్ లో చిక్కుకున్న భారతీయుల తొలి బ్యాచ్ ను మంగళవారం స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఐఎన్ఎస్ సుమేధ 278 మంది ప్రయాణికులతో పోర్ట్ సూడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరింది. యుద్ధంతో అతలాకుతలమైన సూడాన్ లో చిక్కుకున్న తమ పౌరులను రక్షించేందుకు భారత్ ఆపరేషన్ కావేరిని ప్రారంభించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సుడాన్ లోని తమ సోదరులందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జైశంకర్ చెప్పారు. ప్రస్తుతం సూడాన్ అంతటా ఉన్న 3,000 మందికి పైగా భారతీయ పౌరుల భద్రతపై దృష్టి సారించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆపరేషన్ కావేరి కింద భారతీయుల మొదటి బ్యాచ్ సూడాన్ నుంచి బయలుదేరింది. 278 మంది ప్రయాణికులతో ఐఎన్ఎస్ సుమేధ పోర్ట్ సూడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
సౌదీ అరేబియా నగరం జెడ్డాలో భారత వైమానిక దళానికి చెందిన రెండు రవాణా విమానాలను, సుడాన్ లోని కీలక ఓడరేవులో నౌకాదళ నౌకను మోహరించినట్లు భారత్ ఆదివారం తెలిపింది. ఎంఈఏ ప్రకారం, ఓవర్ ల్యాండ్ కదలికలతో సంబంధం ఉన్న ప్రమాదాలు, లాజిస్టిక్ సవాళ్లు ఉన్నాయనీ, సూడాన్ గగనతలం అన్ని విదేశీ విమానాలకు మూసివేయబడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సూడాన్ రాజధాని ఖర్టూమ్ లోని వివిధ ప్రాంతాల నుంచి తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ అక్కడ భద్రతా పరిస్థితి అస్థిరంగానే ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, గత 12 రోజులుగా సూడాన్ సైన్యం, పారామిలటరీ బృంద రక్తసిక్త పోరులో 400 మందికి పైగా మరణించారు.
