డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించారు. "ఆపరేషన్ గోల్డెన్ డాన్" పేరుతో పాన్ ఇండియా ఆపరేషన్‌లో ఏడుగురు సూడాన్ జాతీయులతో సహా 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. 51 కోట్ల విలువైన 101.7 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను పట్టుకోవడంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు విజయం సాధించారు."ఆపరేషన్ గోల్డెన్ డాన్" పేరుతో పాన్ ఇండియా ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఏడుగురు సూడాన్ జాతీయులతో సహా 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 51 కోట్ల విలువైన 101.7 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. DRI అధికారులు ఐదుగురు నిందితులను గుర్తించారు. ముగ్గురు భారతదేశానికి చెందినవారిగా గుర్తించారు. పట్టుబడిన సైఫ్ సయ్యద్ ఖాన్, షంషేర్ ఖాన్, మనీష్ ప్రకాష్ జైన్ లను భారతీయులుగా గుర్తించారు. మిగిలిన వారిని సూడాన్ జాతీయులుగా గుర్తించారు. 

మూడు రోజుల పాటు సాగిన ఆపరేషన్ లో.. DRI స్లీత్‌లు కొలాబా , జవేరీ బజార్‌లోని నాలుగు ప్రదేశాలతో సహా పలు ప్రదేశాలపై దాడి చేశారు.గోల్డ్ స్మగర్లు ఇండో-నేపాల్ సరిహద్దు మార్గాన్ని ఉపయోగిస్తున్నారనీ, అక్రమంగా రవాణా చేయబడిన బంగారాన్ని నేపాల్ నుండి బీహార్‌కు తీసుకువస్తున్నారనీ, ఆ తర్వాత రైలు లేదా విమాన మార్గంలో ముంబైకి రవాణా చేస్తున్నారని DRI అధికారి తెలిపారు.

ఫిబ్రవరి 19న, ముంబయికి వెళ్లాల్సిన పాట్నా రైల్వే స్టేషన్‌లో ముగ్గురు సూడాన్ జాతీయులు రైలు ఎక్కుతుండగా ఏజెన్సీ అధికారులు వారిని అడ్డగించారు. వారి నుంచి 40 ప్యాకెట్లలో 37.13 కిలోల బరువున్న గోల్డ్ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు, వారు ధరించే స్లీవ్‌లెస్ జాకెట్లను ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్స్ లో చాకచక్యంగా దాచిపెట్టారనీ, వారిలో ఒకరు కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న హ్యాండ్లర్ అని అధికారి తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో బంగారాన్ని రవాణా చేసేందుకు వాహనాలను ఏర్పాటు చేసుకున్నారని అధికారులు తెలిపారు. 

ఫిబ్రవరి 20న .. హైదరాబాద్‌ నుంచి ముంబైకి బస్సులో వెళుతుండగా సూడాన్‌కు చెందిన ఇద్దరు మహిళలను పూణెలో పట్టుకున్నారు.వారి హ్యాండ్‌బ్యాగ్‌ల నుంచి 5.615 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే..సోమవారం నాడు పాట్నా నుండి ముంబైకి ప్రయాణిస్తున్న మహమూద్, హసన్ లను లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి 38.76 కిలోల బరువున్న బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారి తెలిపారు.

సుడానీస్‌ను విచారించడంతో కోల్బా, జవేరీ బజార్‌లోని నాలుగు ప్రదేశాల గురించి తెలిపారు. అక్రమంగా తరలించిన బంగారాన్ని అక్కడ నిల్వ చేస్తున్నట్టు గుర్తించారు. అక్కడ నుంచి రూ. 74 లక్షల విలువైన విదేశీ కరెన్సీతో పాటు ₹ 63 లక్షల విలువైన భారతీయ కరెన్సీతో పాటు వివిధ రూపాల్లో ఉన్న 20.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబయికి చెందిన ముగ్గురు నిందితులకు గతంలో భారీ మొత్తంలో స్మగ్లింగ్ బంగారాన్ని అందజేసినట్లు అనుమానంతో దర్యాప్తు అధికారులు మరింత స్కానింగ్ చేస్తున్నారు.