Asianet News TeluguAsianet News Telugu

సీజేఐకు 134 మంది మాజీ సివిల్ సర్వెంట్ల బ‌హిరంగ‌ లేఖ.. బిల్కిస్ బానో కేసు దోషుల విడుద‌లపై అసంతృప్తి..

బిల్కిస్ బానో కేసులో దోషులను మళ్లీ జైలులో పెట్టాలని మాజీ సివిల్ సర్వెంట్లు కోరారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమను మనోవేదనకు గురి చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 

Open letter of 134 former civil servants to CJI. Dissatisfaction over release of Bilkis Bano case convicts..
Author
First Published Aug 28, 2022, 10:31 AM IST

బిల్కిస్ బానో దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప‌ట్ల మాజీ సివిల్ స‌ర్వెంట్లు అంసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆ నిర్ణ‌యాన్ని స‌రిదిద్దాల‌ని కోరుతూ రాజ్యాంగ ప్రవర్తన బృందం ఆధ్వర్యంలోని 134 మంది మాజీ బ్యూరోక్రాట్‌లు శనివారం కొత్తగా నియమితులైన సీజేఐ యూయూ లలిత్‌కు బహిరంగ లేఖ రాశారు. 

‘‘ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మేము తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. ఈ భయంకరమైన తప్పుడు నిర్ణయాన్ని సరిదిద్దే ప్రధాన అధికార పరిధి సుప్రీంకోర్టుకు మాత్రమే ఉందని మేము విశ్వసిస్తున్నాం. అందుకే మేము మీకు లేఖ రాస్తున్నాం ’’ అని లేఖలో వారు పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యం భయంకరమైన తప్పు అని, 11 మంది దోషులను వారి జీవిత ఖైదును అనుభవించడానికి తిరిగి జైలుకు పంపాలని బ్యూరోక్రాట్‌లు కోరారు.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు మృతి

75వ భార‌త స్వాతంత్య్ర వేడుక‌ల సంద‌ర్భంగా గుజ‌రాత్ లో జ‌రిగిన విష‌యం విని దేశంలోని మెజారిటీ ప్ర‌జ‌ల‌లాగే తాము దిగ్భ్రాంతికి గుర‌య్యామ‌ని పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు మే 13 నాటి ఉత్త‌ర్వుల్లో దీనిని ఎందుకు అత్యవసరమని భావించింద‌ని తెలిపింది. “ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఎందుకు అత్యవసరంగా భావించి రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ప్ర‌స్తుతానిది కాకుండా గుజరాత్ 1992 నాటి ఉపశమన విధానం ప్రకారం ఈ కేసును పరిశీలించాలని సుప్రీం కోర్టు ఎందుకు ఆదేశించింది’’ అని అందులో పేర్కొన్నారు. 

రిమిషన్ పిటిషన్‌ను అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వ జైలు సలహా కమిటీలోని పది మంది సభ్యులలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే అని,  ఈ విష‌యం దిగ్భ్రాంతి కలిగించిందని లేఖలో తెలిపారు. “ బాధితురాలు, ఆమె కుటుంబం, సాక్షులు ఈ కేసులో  ప్రాణహాని మరియు భౌతిక హాని బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడారు. దీని కోసం వారు ప‌దే ప‌దే త‌మ ఇళ్లు కూడా మార్చుకున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో దోషుల విడుద‌ల వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో నిర్ధారించడం గుజరాత్ ప్రభుత్వానికి తప్పనిసరి. బాధితురాలు, ఆమె మద్దతుదారులు తమను దోషులు వారి కుటుంబాలు, స్నేహితుల ద్వారా త‌ర‌చుగా హింసకు, బెదిరింపులు పాల్ప‌డ్డారు ’’ అని ఆ లేఖ పేర్కొంది. 

నేడు నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత: 3700 కిలోల పేలుడు పదార్ధాల వినియోగం

ఇదిలా ఉండ‌గా.. దాదాపు 6,000 మంది ప్రముఖ పౌరులు కూడా ఈ విడుద‌ల‌కు వ్య‌తిరేకంగా సుప్రీంకోర్టుకు లేఖ రాయ‌డం ఇక్క‌డ ఆస‌క్తిక‌ర అంశం. ఈ రిమిష‌న్ ను ర‌ద్దు చేయాల‌ని వారు త‌మ లేఖ‌ల్లో  సుప్రీంకోర్టును కోరారు. కాగా.. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉద్యమకారులు సుభాషిణి అలీ, జర్నలిస్టు రూపవతి లాలూ, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై మాజీ సీజేఐ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 25న కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాల స్పందనను కోరింది. 11 మంది దోషులను ఇంప్లీడ్ చేయాలని కోర్టు ఆదేశించిది. అలాగే  రెండు వారాలకు ఈ కేసును వాయిదా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios