ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రోజురోజుకూ బెదిరింపు కాల్స్ ఎక్కువవుతున్నాయి. తాజాగా యూపీ పోలీసులకు చెందిన 112 అనే వాట్సాప్ నెంబర్ కు సీఎంను చంపేస్తామని మరోసారి బెదిరింపు మెసేజ్ లు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఏప్రిల్ 29న గుర్తు తెలియని ఓ వ్యక్తి ‘యూపీ సీఎం ఆదిత్యానాథ్ కు ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. ఆయనకు మరణం తప్పదు’ అని  ఓ మెసేజ్ తో హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద పోలీసులు ఇప్పటికే సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 

అంతేగాక హెచ్చరికలు పంపినవారెవరో తెలుసుకుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓ నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే యూపీ సీఎంకు బెదిరింపులు రావడం ఇది మొదటి సారేం కాదు. 

గత నెలలో కూడా హెంమంత్రి అమిత్ షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ ను కూడా చంపేస్తామని బెదిరిస్తూ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు ఈ మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అతాగే నిరుడు సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ లలో యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని బెదిరిస్తూ కాల్స్ వచ్చాయి.