మన రాష్ట్రంలో ఉల్లి ధర మండిపోతుంటే.. పక్క రాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఉల్లి ధర ధారుణంగా పడిపోయింది. కేవలం రూ.1కే ఉల్లిగడ్డల అమ్మకాలు చేపడుతున్నారు.

దీంతో ఉల్లిపండించిన కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ రాష్ట్ర రైతులు భారీ స్థాయిలో ఉల్ల‌గ‌డ్డ‌లు పండిస్తుంటారు. హుబ్లీ, ధార్వాడ్‌, హ‌వేరి, గ‌డ‌గ్‌, బాల్కోట్‌, బెల్గావ్‌, దేవ‌న్‌గిరి, చిత్ర‌దుర్గ్ న‌గ‌రాల్లో 100 కిలోల బ్యాగ్‌ను వంద రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. 

వారం క్రితం క్వింటాల్ బ్యాగు 500 రూపాయ‌ల‌కు వ‌చ్చేది. కానీ రెండు మూడు రోజుల్లోనే ధ‌ర‌లు దారుణంగా ప‌డిపోయాయి. ధ‌ర‌లు త‌గ్గిపోవ‌డంతో కర్ణాటక నుంచి ఇతర ప్రాంతాలకు ఉల్లి సరఫరా జరుగుతోంది.