బీహార్ లోని దర్భంగా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ షాక్ కు గురై ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఎనిమిదిమంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. 

మృతుని కుటుంబానికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించి, వెంటనే బాధిత కుటుంబానికి ఆ మొత్తాన్ని చెక్కు రూంలో అందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు తగిన విధంగా వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్కూలు గేటుపై ఒక విద్యుత్ తీగ తెగిపడింది. అది గమనించని విద్యార్థి ఆ గేటును తాకాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై, అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.