Delhi Violence Case: ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో శనివారంనాడు హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన మత హింసపై పోలీసులు ఏకపక్ష దర్యాప్తు జరుపుతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అనుమతి లేకుండా ఊరేగింపుకు అనుమతించారని, మతపరమైన ఊరేగింపులో ఆయుధాలు తీసుకెళ్లారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.
Delhi Violence Case: ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలు కాగా, 14 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జహంగీర్‌పురి హింసాత్మక ఘటనలో పోలీసులు ఏకపక్ష దర్యాప్తు జరుపుతున్నారనీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతిచోటా బుజ్జగింపులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఊరేగింపునకు పోలీసుల అనుమతి లేదని, పైగా రెచ్చగొట్టే నినాదాలు ఈ ఊరేగింపులో చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు.
అనుమతి లేకుండానే ఎందుకు ఊరేగింపును జరగనిచ్చారు? రెచ్చగొట్టే నినాదాలు ఎందుకు చేశారు? అంటూ ఒవైసీ వరుస ప్రశ్నలు గుప్పించారు. ఊరేగింపునకు అనుమతి ఇవ్వలేదంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా పేర్కొన్నడానికి ఈ సందర్భంగా ఒవైసీ ప్రస్తావించారు. కాగా, దీనికి ముందు ఆస్థానా మాట్లాడుతూ, ఊరేగింపు సందర్భంగా మసీదుపై ఎలాంటి జెండా ఎగురవేసే ప్రయత్నం జరగలేదని చెప్పారు. హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరనీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
హింసకు ప్రభుత్వానిదే బాధ్యతనీ, జహంగీర్‌పురి సీ బ్లాక్‌లో మతపరమైన ఊరేగింపులో పాల్గొన్నవారు ఆయుధాలు ఝలిపించడంపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన మతపరమైన ఊరేగింపులో ఆయుధాలు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇంతకుముందు రెండు ఊరేగింపులు జరిగాయని, ఈ ఊరేగింపులో హింస ఎందుకు జరిగిందని ఒవైసీ ప్రశ్నించారు. హింసను తాను పూర్తిగా ఖండిస్తున్ననీ. హింసకు తావులేకుండా.. చట్ట ప్రక్రియను పాటించాలనీ,. కానీ, పోలీసులు ఏకపక్ష (ఒకే కోణం నుంచి) దర్యాప్తు చేస్తున్నారని ఒవైసీ అన్నారు. ఘటనను ఖండిస్తున్నాను. రెచ్చగొట్టే నినాదాలు ఎందుకు చేశారు? అని ప్రశ్నించారు. అనుమతి లేకుండా ఊరేగింపుకు అనుమతించారని నిలదీశారు. ప్రభుత్వం కోరుకున్నప్పుడు మత హింస జరుగుతుందని ఆరోపించారు.
జహంగీర్‌పురి హింస కేసును 14 పోలీసు బృందాలు విచారిస్తున్నాయని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. ఈ దాడిలో ఎనిమిది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు సహా తొమ్మిది మంది గాయపడిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశారు, హింసాకాండలో గాయపడిన పోలీసులను ఢిల్లీ పోలీస్ చీఫ్ పరామర్శించారు, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే.. నాలుగు ఫోరెన్సిక్స్ బృందాలు సంఘటన స్థలాన్ని పరిశీలించాయని డీసీపీ అస్థాన మీడియాకు తెలిపారు.
ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను ఆదివారం రోహిణి కోర్టు ముందు హాజరుపరిచారు. ఇద్దరు ప్రధాన నిందితులు అన్సార్, అస్లాంలను ఓ రోజు పోలీసు కస్టడీకి పంపారు. మిగిలిన 12 మందిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా పరిశీలిస్తున్నామని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
మసీదులో జెండాలు అమర్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. నిందితుల వద్ద నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జహంగీర్‌పురి ప్రాంతంలో ఆంక్షలు విధించమనీ, పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలీసు భద్రతను తగ్గిస్తామని ఢిల్లీ సీపీ తెలిపారు. హింసాత్మక ఘర్షణలపై ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నట్లు క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు.
