Asianet News TeluguAsianet News Telugu

లావుగా ఉందని భర్త వదిలేస్తే.....దిమ్మతిరిగే షాకిచ్చిన వైఫ్

బాగా లావుగా ఉందనే  కారణంగా భర్త వదిలేయడంతో ఎలాంటి కుంగిపోకుండా ఓ మహిళ బాడీ బిల్డర్‌గా మారింది. పలు పోటీల్లో పాల్గొని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫిట్‌నెస్‌ పెంచుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచింది.

Once body shamed, this Tamil Nadu woman is winning medals for India
Author
Tamil Nadu, First Published Sep 27, 2018, 3:34 PM IST


చెన్నై: బాగా లావుగా ఉందనే  కారణంగా భర్త వదిలేయడంతో ఎలాంటి కుంగిపోకుండా ఓ మహిళ బాడీ బిల్డర్‌గా మారింది. పలు పోటీల్లో పాల్గొని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫిట్‌నెస్‌ పెంచుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రూబీ కథ ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు చెందిన రూబీ అనే మహిళ కొడుకు పుట్టాక విపరీతంగా బరువు పెరిగింది. ఆమె స్థూలకాయురాలుగా మారింది. దీంతో  ఆమెను భర్త వదిలేశాడు. లావుగా ఉందనే ఒకే ఒక్క కారణంతో రూబీని భర్త వదిలేశాడు.

అంతేకాదు  ఈ సమయంలోనే  ఇంట్లోని వారు సూటీపోటీ మాటలతో వేధింపులకు పాల్పడేవాడరు. వీటన్నింటిని పంటిబిగువన భరించిన రూబీ బాడీ బిల్డర్‌గా మారింది. తనను విమర్శించిన వారికి  తగిన బుద్ది చెప్పాలని భావించింది.  అందుకే ఫిట్‌నెస్ ద్వారా తనను విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాలని ప్లాన్ చేసింది.

నిపుణుల సలహాలతో ఫిట్‌నెస్ సాధించింది. అంతేకాదు పెద్ద బాడీ బిల్డర్‌గా మారింది. కేరళలో జరిటిన బాడీ బిల్డర్ల పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో పతకాన్ని  కూడ అందుకొంది. తమిళనాడు లో జరిగిన పోటీల్లో కూడ రూబీ మంచి పేరు సాధించింది.

ఏడాదిలో సాధించాల్సిన దాన్ని తన విల్ పవర్‌తో ఆరు మాసాల్లోనే  రూబీ సాధించిందని ఆమె ట్రైనర్ కార్తీక్ చెప్పారు.  తాను అనుకొన్నది సాధించేందుకు రూబీ ఎంతగానో కష్టపడిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios