Asianet News TeluguAsianet News Telugu

అదృష్టమంటే ఇతడిదే.. రాత్రికి రాత్రే.. కోట్ల రూపాయాల లాటరీ తగిలింది.!

ప్రతి మనిషినీ అదృష్టం అనేది ఎప్పుడో అప్పుడు ఏదో రూపంలో పలకరిస్తుంది. కాకపోతే దానిని గుర్తించినవారు నిజమైన అదృష్టవంతులవుతారు.. కేర‌ళ‌కు చెందిన ఆటో రిక్షా డ్రైవర్ అనూప్ జీవితంలో కూడా అలానే జ‌రిగింది. అదృష్టం త‌లుపు త‌ట్ట‌డంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. 

Onam Bumper Lottery: Autorickshaw driver wins Rs 25 crore prize
Author
First Published Sep 19, 2022, 3:23 AM IST

అదృష్టం.. ఎప్పుడు ?, ఎవరిని? ఎలా ? వరిస్తుందో ?  చెప్ప‌డం చాలా క‌ష్టం. కొందరికి జీవితాల్లో ఊహించని విధంగా రాత్రికి రాత్రి అదృష్ట దేవ‌త క‌నిక‌రించి.. కోట్ల రూపాయాల‌ను కుమ్మ‌రిస్తుంది. సాధారణంగా లాటరీలో ఏ చిన్న బహుమతి గెలిచినా.. లేదా కొద్దిమొత్తంలో న‌గ‌దు గెలుచుకున్న‌ చాలా హ్యాపీగా  ఫీలవుతాం. లాటరీ టికెట్ కొనుగొలు చేసిన ద‌గ్గ‌ర నుంచి ఫ‌లితాలు విడుద‌ల‌య్యే.. క్షణం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. అలాంటిది ఓ వ్యక్తి లాటరీలో భారీ జాక్ పాట్ కొట్టాడు. ఒకటికాదు.. రెండుకాదు ఏకంగా రూ. 25 కోట్లు గెలుచుకున్నాడు. ఇలా అదృష్టం వరించడంతో కేర‌ళ‌కు చెందిన ఆటో రిక్షా డ్రైవర్ అనూప్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. 

వివరాల్లోకెళ్తే... కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీవరాహం నివాసి అనూప్. అత‌డు వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్. కానీ.. ఆయ‌న జీవితంగా సాఫీగా సాగ‌డం లేదు. దీంతో పొట్ట‌గూటి కోసం.. మలేషియా వెళ్లి చెఫ్‌గా పని చేయాలనుకున్నాడు. ఇందుకోసం రూ.3 లక్షల రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. అతని రుణం కూడా ఆమోదించబడింది. అయితే.. ఈ క్ర‌మంలో అత‌డు శనివారం సాయంత్రం పజవంగడి లో ఐదువంద‌ల రూపాయాలు పెట్టి.. లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అత‌డు చేసిన ఆ చిన్న ప‌నే..ఆయ‌న‌ జీవితాన్ని మార్చి వేసింది. దెబ్బ‌కు అదృష్టం మారింది. రాత్రికి రాత్రే ఆ వ్యక్తి కోటీశ్వ‌ర‌డ‌య్యాడు. అత‌డు లాటరీలో ఒక్క‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.25 కోట్లను గెలుచుకున్నాడు. 

ఈ సంద‌ర్బంగా అనూప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అదృష్టం తనకు అనుకూలంగా ఉంటుందని ఊహించలేదని, ప్రైజ్ మనీతో ఏమి చేయాలో నిర్ణయించుకోలేదని చెప్పాడు. చివరి నిమిషంలో టికెట్ కొనేందుకు తన కొడుకు పిగ్గీ బ్యాంకు నుంచి రూ.50 తీసుకున్నట్లు ఆటోరిక్షా డ్రైవర్ చెప్పాడు. గత 22 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని, ఇప్పటి వరకు కొన్ని వందల రూపాయల నుంచి గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు వచ్చాయని తెలిపారు.

తాను ఇంత మొత్తం గెలుస్తానని ఊహించలేదని, అందుకే లాటరీ ఫలితాలను టీవీలో చూడలేదన్నారు. లాట‌రీ గెలుచుకున్న‌ట్టు మెసెజ్ వ‌చ్చినా.. తొలుత న‌మ్మ‌లేద‌నీ, త‌న‌ భార్యకు చూసి.. లాట‌రీ గెలుచుకున్న‌ట్టు చెప్పింద‌ని తెలిపాడు,  అయినా.. త‌న సందేహాం ఉండ‌టంతో లాటరీ అమ్మిన ఏజెంట్ కు  టికెట్ ఫోటో పంపాననీ, తానే లాట‌రీ విజేతల‌నీ  ధృవీకరించాడని తెలిపారు. గెలిచిన డబ్బులో పన్ను కట్టిన తర్వాత అనూప్‌కి దాదాపు రూ.15 కోట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా, కొట్టాయంలో విక్రయించిన టికెట్‌కు రెండో బహుమతి రూ.5 కోట్లు లభించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios