కేరళ వరదలు.. మహిళకు పురిటినొప్పులు..ఎలాకాపాడారంటే..(వీడియో)

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 18, Aug 2018, 10:25 AM IST
On Video, Navy Rescue Of Kerala Pregnant Woman Whose Water Broke
Highlights

అలాంటి సమయంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి.  కానీ.. అలాంటి సమయంలోనూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారి ప్రతిభను కనపరిచారు. ఆమెను సురక్షితంగా కాపాడగలిగారు.

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమయ్యింది. రాష్ట్రమంతా భారీ వరదలు ముంచెత్తుతున్నాయి.  ఇప్పటికే ఈ వరదల కారణంగా 300మందికిపైగా మృత్యువాతపడ్డారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. మరికొందరికీ కనీసం ఇంటి నుంచి కాలు తీసి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి.

అలాంటి సమయంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి.  కానీ.. అలాంటి సమయంలోనూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారి ప్రతిభను కనపరిచారు. ఆమెను సురక్షితంగా కాపాడగలిగారు.

 

పూర్తి వివరాల్లోకి వెళితే...కోచి ప్రాంతానికి చెందిన సజిత అనే గర్భిణికి శుక్రవారం (ఆగస్టు 17) మధ్యాహ్నం పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. కనుచూపు మేరలో అంతా నీటిమయం కావడంతో ఆమెలో ఆందోళన మొదలైంది. స్థానిక అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. హెలికాప్టర్ సాయంతో ఆమెను కాపాడి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

 

వరద నీటిలో చిక్కుకున్న గర్భిణిని ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సజితను తాడు సాయంతో సురక్షితంగా హెలికాప్టర్లోకి చేరుస్తున్న వీడియో వైరల్‌ అయింది. అంతకుముందు ఆందోళనకు గురైన సజితకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ధైర్యం నూరిపోశారు. అయితే.. వాతావరణం అనుకూలించకపోవడం మరింత ఆందోళన కలిగించింది. 

ప్రతికూల వాతావరణంలోనూ పైలట్ విజయ్‌ వర్మ హెలికాప్టర్‌ను చాకచక్యంగా నడిపారు. ఆమె ప్రాణాలు కాపాడటాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారులు సవాలుగా తీసుకున్నారు. ఈ కారణంగానే సజిత ప్రాణాలు దక్కాయి. ఇండియన్ నేవీకి చెందిన ‘చేతన్’ బృందం కేవలం అర గంటలో ఈ ఆపరేషన్‌ను పూర్తిచేసింది ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది సేపటికే  బిడ్డకు జన్మనిచ్చారు. 
 

loader