Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు

ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును లోక్‌సభలో చర్చను ప్రారంభించారు

On Triple Talaq Bill, Government, Opposition Clash Again: 10 Points
Author
New Delhi, First Published Jun 21, 2019, 1:29 PM IST

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. విపక్షాలు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించాయి.విపక్షాల ఆందోళనల మధ్యే  ఆయన చర్చను ప్రారంభించారు.

గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వంత ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ది ముస్లిం వుమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజీ  బిల్లు, 2019‌ను ఇవాళ సభలో ప్రవేశపెట్టారు. 

గత టర్మ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో పాస్ చేసుకొంది. కానీ, రాజ్యసభలో  ఆ బిల్లు పాస్ కాలేదు.ఈ బిల్లుకు పలు పార్టీలు సవరణలు కోరాయి.  అయితే బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో గత మాసంలోనే  16వ లోక్‌సభ రద్దైంది.దీంతో ఈ బిల్లు కూడ రద్దైంది. ఈ కారణంగానే ఇవాళ ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.

ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సిఫారస్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేశారు. ఈ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని  ఆయన అభిప్రాయపడ్డారు.

ముస్లిం మహిళలకు ఈ బిల్లు ద్వారా న్యాయం జరుగుతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.245 మంది సభ్యులున్న రాజ్యసభలో టీడీపీకి చెందిన నలుగురు బీజేపీలో చేరడంతో   ఆ పార్టీ బలం 102 నుండి 106కు చేరింది.

ఎన్డీఏతో మిత్రపక్షంగా ఉన్న జేడీ(యూ) మాత్రం  ట్రిపుల్ తలాక్ పై తమ పార్టీ వెనక్కు తగ్గబోమని తేల్చిచెప్పింది. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి వైసీపీ, బిజూ జనతాదళ్ ఆసక్తి చూపడం లేదు.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు న్యాయం జరగదని ఎంైఎం ఎంపీ అసుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ఆయన పట్టుబట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios