కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై విపక్షాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ ఎంపీ తనదైన శైలిలో విమర్శలు చేశారు.

మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో ఆయన ‘‘ కిసాన్ కీ బాత్’’ పేరిట జరిగిన ఈ వర్చువల్‌ సంభాషణలో పంజాబ్‌, హరియాణా, బిహార్‌, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి పది మంది రైతులు పాల్గొన్నారు.

ఈ సంభాషణలో రాహుల్‌ గాంధీ ఈ చట్టం రైతులకు ఏ విధంగా హాని కలిగిస్తుందో చెప్పాల్సిందిగా కోరారు. దాంతో బిహార్‌కు చెందిన ధీరేంద్ర కుమార్‌ అనే రైతు మాట్లాడుతూ.. ‘ఈ చట్టాలు పూర్తిగా నల్ల చట్టాలని.. వీటి వల్ల రైతులు దోపిడీకి గురవుతారని అభిప్రాయపడ్డారు.

కనీస మద్దతు ధర విషయం గురించి రైతులు ఎందుకు భయపడుతున్నారని రాహుల్‌ ప్రశ్నించిగా.. దీన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటారు, రైతులను మోసం చేస్తున్నారు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

మహారాష్ట్రకు చెందిన గజానన్‌ కాశీనాథ్‌ అనే రైతు మాట్లాడుతూ.. తాను కరోనా వైరస్‌ కంటే ఎక్కువగా ఈ చట్టాలకు భయపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమి తన తరువాతి తరం వారికి ఉంటుందా లేదా అనే అనుమానం తలెత్తుతోందని చెప్పాడు.

ఇక రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. తన మొదటి పెద్ద పోరాటం భూ సేకరణపై జరగిందని గుర్తుచేసుకున్నాడు. 2011 ఉత్తరప్రదేశ్‌ భట్టా పార్సౌల్‌లో అరెస్ట్‌ చేయడాన్ని అతను ప్రస్తావించారు.

నాటి ఘటనలో తనపై దాడి జరిగిందని.. అయితే తాను దాన్ని ఎదుర్కున్నాను అని గజానన్ తెలిపారు. ఇక కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీకి పెద్ద తేడా లేదన్నారు. ఈ చట్టాలు రైతు హృదయంలో కత్తిపోటు లాంటివంటూ రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.