బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే.. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. రంగంలోకి దిగి అందరిపైనా కంగనా రనౌత్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కొంత మంది కారణంగానే సుశాంత్ చనిపోయాడంటూ ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో.. బేబీ పెంగ్విన్ అంటూ..  మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఆదిత్య ఠాక్రే పై కూడా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. రాజకీయంగానూ ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

నటి కంగనా రనౌత్ కి..  మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కాగా.. ఈ వార్ లో.. కంగనాకి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ మద్దతుగా నిలిచారు. అయితే.. ట్విట్టర్ వేదిగా ఇన్ డైరెక్ట్ గా అమృత.. కంగనాకి సపోర్ట్ గా నిలవడం గమనార్హం.

 

ముంబయి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లా మారిపోయింది అంటూ ఇటీవల అమృత ట్వీట్ చేశారు. కాగా.. తాజాగా శివసేన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మరో ట్వీట్ చేశారు. అందులో కంగనా పేరు పెట్టకుండా ఈ ట్వీట్ చేయడం విశేషం.

‘ఎవరైనా చెప్పేదానితో మనం ఏకీభవించకపోవచ్చు, కాని ప్రజాస్వామ్యంలో వ్యక్తీకరించే హక్కును మనం కాపాడుకోవాలి! వాక్ స్వేచ్ఛ, నమ్మక స్వేచ్ఛ, ఉద్యమ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ-అణచివేయలేము!’ అంటూ అమృత ట్వీట్ చేశారు.

కాగా.. సుశాంత్ కేసుని మహారాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం  చేస్తోందంటూ మొదటి నుంచి కంగనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అధికార పార్టీ నేతలు కూడా కంగనాపై ఎదురు దాడికి దిగుతున్నారు. దీంతో.. అమృత ఆమెకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు.