గృహరుణాలపై ప్రత్యేక తగ్గింపు వడ్డీరేటును మహిళలకు అందించనుంది. హోంలోన్ల వడ్డీ రేటును అదనంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్బీఐ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సొంతింటి కలని నిజం చేసుకోవాలనుకునే మహిళలకు తీపి కబురు అందించింది. గృహరుణాలపై ప్రత్యేక తగ్గింపు వడ్డీరేటును మహిళలకు అందించనుంది. హోంలోన్ల వడ్డీ రేటును అదనంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది.
Scroll to load tweet…
తాజా సవరణ ద్వారా 6.70 శాతం వద్ద ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు తెలిపింది. విమెన్స్ డే సందర్బంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరింది. మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్ చేసింది. అలాగే యోనో యాప్ ద్వారా జరిపే బంగారు, డైమండ్ ఆభరణాల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 30 శాతం దాకా తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది.
