Asianet News TeluguAsianet News Telugu

బంఫర్ ఆఫర్ : ఎక్కువమంది పిల్లల్ని కనండి.. ఫ్రైజ్ మనీ కొట్టేయండి...

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ పై దృష్టి పెడుతుండగా మిజోరాం రాష్ట్రంలో ఓ మంత్రి ఆసక్తికర ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో అధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించారు.
 

On Father's Day, Mizoram minister announces Rs 1 lakh cash prize for having maximum number of children - bsb
Author
Hyderabad, First Published Jun 22, 2021, 2:40 PM IST

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ పై దృష్టి పెడుతుండగా మిజోరాం రాష్ట్రంలో ఓ మంత్రి ఆసక్తికర ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో అధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించారు.

మిజోరాం క్రీడా శాఖ మంత్రి రాబర్ట్ రోమావియో ఫాదర్స్ డే సందర్భంగా ఈ ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో ఐజ్వాల్ తూర్పు- 2 పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లి లేదా తండ్రికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం  అందిస్తానని వెల్లడించారు. నగదు బహుమతితో పాటు ట్రోఫీ కూడా అందజేస్తానని తెలిపారు. అయితే అత్యధిక సంతానం అంటే ఎంతమంది పిల్లలు అనేది మాత్రం మంత్రి స్పష్టంగా చెప్పలేదు.

మిజో వర్గంలో జనాభా తగ్గుదల ఆందోళనకరంగా మారుతోంది. కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఈ జనాభా సరిపోవడం లేదు. మిజో లాంటి గిరిజన తెగలకు ఇది సమస్యగా మారుతోంది.  అందుకే ఈ తెగలో జనాభాను పెంచేందుకు ఈ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించాం అని రాబర్ట్ రొమావియా చెప్పుకొచ్చారు. 

ఇందుకయ్యే ఖర్చును రాబర్ట్ కుమారుడికి చెందిన నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ భరించనున్నట్లు తెలుస్తోంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మిజోరాం జనాభా 10,91,014. దేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రెండో రాష్ట్రం మిజోరాం.

అయితే మిజోరాంకు పొరుగునే ఉన్న అస్సాం రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో జనాభాను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఏడాది  జనవరి నుంచి అస్సాంలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇద్దరు సంతానం నిబంధన  అమలు చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios