Mumbai : ఫేస్ బుక్ లైవ్ లో దారుణం.. ప్రత్యర్థిని చంపి.. ఆపై తాను కాల్చుకుని ఆత్మహత్య

Mumbai : మహారాష్ట్రలోని థానేలో బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు జరిగిన తర్వాత ముంబైలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ లైవ్ సమయంలో ఓ వ్యక్తి  మాట్లాడుతుండగా దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబయి (Mumbai)లో చోటుచేసుకుంది.  

On Facebook Live, Team Thackeray Leader's Son Shot Dead In Mumbai krj

Mumbai : మహారాష్ట్రలోని థానేలో బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు జరిగిన తర్వాత ముంబైలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ లైవ్ సమయంలో ఓ వ్యక్తి  మాట్లాడుతుండగా దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబయి (Mumbai)లో చోటుచేసుకుంది. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన అభిషేక్‌ ఘోసాల్కర్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అతడి తండ్రి వినోద్‌ పార్టీలో సీనియర్‌ నేత. కాగా.. స్థానిక ఉద్యమకారుడైన నోరాన్హ, అభిషేక్‌ల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముంబయిలోని బొరివిల్లీ ప్రాంతంలో పనులు గురించి మాట్లాడుకోవడానికి నోరాన్హ తన కార్యాలయానికి అభిషేక్‌ను ఆహ్వానించాడు. ఈ క్రమంలో నోరాన్హ, అభిషేక్‌లు ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు.  ఈ క్రమంలో సడెన్ గా నోరాన్హ .. అభిషేక్ ఘోసల్కర్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఘోషాల్కర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, మరోవైపు అభిషేక్ ఘోషాల్కర్‌పై కాల్పులు జరిపిన నోరాన్హ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అభిషేక్ ఘోషాల్కర్ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఈ ఘటన కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ దారుణ ఘటన ముంబైలోని దహిసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటన అనంతరం పోలీసులు విచారణ ప్రారంభించారు. అభిషేక్ ఘోషాల్కర్‌పై బుల్లెట్లు పేల్చిన నోరాన్హ నేర చరిత్రను ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అతడిపై పలు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది.

అభిషేక్ ఘోషల్కర్ ముంబైలోని కారుణ్య ఆసుపత్రిలో చేరారు. అతడిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ముంబైలో సంచలనం సృష్టించిన ఈ ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో ముంబైకి ఆనుకుని ఉన్న థానేలో శివసేన షిండే వర్గానికి చెందిన నేతపై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ పోలీస్ స్టేషన్‌లో కాల్పులు జరిపారు. అభిషేక్ ఘోషాల్కర్ శివసేన UBT నాయకుడు వినోద్ ఘోషాల్కర్ కుమారుడు. పరస్పర విబేధాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక సమాచారం.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. ప్రస్తుతం మహారాష్ట్రలో అరాచక వాతావరణం నెలకొందని శివసేన యూబీటీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో నెటింట్లో వైరల్ గా మారింది. అభిషేక్ ఘోషాల్కర్ తండ్రి వినోద్ ఘోషాల్కర్ 2009లో శివసేన టిక్కెట్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో గ్రేటర్ ముంబై ఏరియాలో కౌన్సిలర్‌గా ఉన్నారు. ప్రస్తుతం అభిషేక్ ఘోషాల్కర్ కూడా కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios