ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం నోయిడాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన నోయిడా వస్తున్న సందర్భంగా అక్కడ ఓ సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే... ఆ సభలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటో తెలుసా..? తన బిడ్డతో కలిసి విధులకు రావడమే. 

నెలల బిడ్డను ఎత్తుకొని ఆమె విధులకు హాజరైంది. దీంతో.. కెమేరాలన్నీ ఆమె వైపే ఫోకస్ పెట్టాయి. అంత చిన్న బిడ్డను తీసుకొని విధులకు ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించింది.

Also Read ఘెర రోడ్డు ప్రమాదం...8మంది మృతి, 22మందికి గాయాలు...

తన భర్త ఓ పరీక్షకు హాజరు కావాల్సి వచ్చిందని.. దీంతో... తన బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తప్పనిసరై బిడ్డతో సహా విధులకు హాజరయ్యాను అంటూ కానిస్టేబుల్ ప్రీతీ రాణి తెలిపారు.

కాగా... సదరు మహిళా కానిస్టేబుల్ కి గ్రేటర్ నోయిడా లోని దాద్రి పోలీస్ స్టేషన్ లో ఉదయం 6గంటల నుంచే వీవీఐపీ డ్యూటీ కేటాయించారు. తనకు డ్యూటీ చాలా ముఖ్యమని.. అందుకే బిడ్డను తీసుకొని మరీ వచ్చానని సదరు కానిస్టేబుల్ చెప్పడం గమనార్హం.

కాగా... ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా గౌతమ్ బుద్ధ నగర్ వచ్చారు. సోమవారం నోయిడా కి వచ్చారు. అక్కడ ఆయన రూ.1,452 కోట్లు విలువచేసే ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేకాకుండా రూ.1,369 కోట్లు విలువచేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.