కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య గ్యాప్ వివాదం.. కేంద్రం స్పష్టత
కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య దూరానికి సంబంధించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. తొలి డోస్‌కు రెండవ డోసుకు మధ్య దూరం పెంచడంపై గందరగోళం నెలకొనడంతో ఆయన వివరణ ఇచ్చారు.
కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య దూరానికి సంబంధించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. తొలి డోస్‌కు రెండవ డోసుకు మధ్య దూరం పెంచడంపై గందరగోళం నెలకొనడంతో ఆయన వివరణ ఇచ్చారు. తొలుత కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్నాకా 6-8 వారాల లోపు రెండవ డోసు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. అనంతరం దీనిని 12-16 వారాల వరకు పెంచింది. అయితే దీనిపై ప్రజలు, ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిలో గందరగోళానికి కారణమైంది. ఈ పరిణామాల మధ్య హర్షవర్థన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంపుపై శాస్త్రీయ డేటా ఆధారంగా చాలా పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించడానికి భారత్‌కు చాలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను రాజకీయం చేయడం దురదృష్టకరం’’ అని హర్షవర్ధన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
కొవిషీల్డ్ డోసుల వ్యవధిని 8-12 వారాలకు మాత్రమే పెంచాలని తాము సిఫార్సు చేశామని, కానీ 12-16 వారాలకు పెంచుతూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఏజీఐ) సభ్యులు కొందరు చెప్పినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ల కొరత కారణంగానే కొవిషీల్డ్ డోసుల వ్యవధిని పెంచినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హర్షవర్థన్ స్పష్టతనిచ్చారు.
Also Read:కోవిడ్ 19 : దేశంలో కొత్తగా 62 వేల కేసులు, లక్షకు పైనే రికవరీలు..
అటు ఎన్‌టీఏజీఐ ఛైర్మన్ డా.ఎన్‌కే అరోరా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. డోసుల మధ్య వ్యవధి పెంపు అనేది పూర్తిగా శాస్త్రీయత ఆధారంగా తీసుకున్న నిర్ణయమేనని స్పష్టం చేశారు. దీనిపై ఎన్‌టీఏజీఐ సభ్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవంటూ మీడియా కథనాలను తోసిపుచ్చారు.
కొవిషీల్డ్ డోసుల వ్యవధిపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయని అరోరా పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తుల్లో వ్యవధి తగ్గించే అవకాశం కూడా లేకపోలేదన్నారు. కొవిడ్19, వ్యాక్సినేషన్ అనేది నిరంతరం మారే ప్రక్రియ అని ఒక వేళ డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని రేపు శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే వాటిని కూడా కమిటీ పరిశీలిస్తుందని అరోరా వెల్లడించారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయమే మంచిదని తేలితే.. దాన్నే కొనసాగిస్తామని డాక్టర్ అరోరా స్పష్టం చేశారు.