కదిలే కారులో నుంచి మహిళను... భర్త, అత్తమామలు తోసేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది... ఈ ఘటనంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాగా... ఈ వీడియో.. నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకి చెందిన అరుణ్ జూడే అమల్రాజ్ అనే వ్యక్తి ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కాగా అతనికి 2008లో ఆర్తి(38) అనే మహిళతో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా... వివాహం అయిన నాటి నుంచి ఏదోక విధంగా  భార్యను హింసిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో 2014లో ఆర్తి... తన భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పిల్లలతో కలిసి ముంబయిలోని తన పుట్టింటికి వెళ్లిపోయి... అక్కడ, భర్త, అత్తమామలపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. దీంతో.. అరుణ్ దిగి వచ్చాడు. ఇంకెప్పుడు హింసించను అని మాట ఇవ్వడంతో ఆర్తి తన కేసును వెనక్కి తీసుకొని తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. కాగా...తాజాగా భార్యను, పిల్లలను వదిలించుకోవాలని తన తల్లిదండ్రులతో కలిసి పథకం వేశాడు. ఈ క్రమంలోనే.. కారులో బయటకు తీసుకువెళ్లి.. కదులుతున్న వాహనం నుంచి ఆర్తి, ఇద్దరు చిన్నారులకు కిందకు తోసేసారు. దీంతో.. ఆర్తికి, చిన్నారులకు గాయాలయ్యాయి.

దీంతో...బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు, వీడియో ఆధారంగా అరుణ్, అతని తల్లిదండ్రులపై హత్యాప్రయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు. కాగా.. ప్రస్తుతం నిందితులు పరారీలో  ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.