ఆ సమయంలో.. ఆమె ముఖానికి మాస్క్ ధరించలేదు. అంతే.. మాస్క్ లేకుండా ఆమె పోలీసుల కంట పడింది. 

మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ మహిళ పట్ల పోలీసులు అతి దారుణంగా ప్రవర్తించారు. దారుణంగా కొట్టి.. రోడ్డు మీద లాక్కెళ్లారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించగా.. కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ నియమాలు విధించారు. వాటిని పాటించని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఓ మహిళ పట్ల మాత్రం అతి దారుణంగా ప్రవర్తించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో ఓ మహిళ తన కుమార్తెతో కలిసి ఇంటికి అవసరమయ్యే సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చింది. ఆ సమయంలో.. ఆమె ముఖానికి మాస్క్ ధరించలేదు. అంతే.. మాస్క్ లేకుండా ఆమె పోలీసుల కంట పడింది. 

Scroll to load tweet…

అంతే.. ఆమెపై పోలీసులు విరుచుకుపడ్డారు. అతి దారుణంగా కొట్టారు. అనంతరం రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఆమె లేచేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. లేవలేకపోతోంది. వీళ్లు మాత్రం ఆమెపై దాడి ఆపలేదు. దీనిని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఓ మహిళా పోలీసులు.. సదరు మహిళను పోలీసు వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించగా.. ఆమె నిరకారించింది. మరోవైపు మహిళ కుమార్తె.. ఆమెను వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పోలీసులు మహిళ జట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకెళ్లడం గమనార్హం. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.