బెల్టు తీసి కొడతానంటూ అధికారులకు కేంద్రమంత్రి వార్నింగ్, వీడియో వైరల్

అధికారులతో దురుసుగా ప్రవర్తిసున్నారంటూ కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది

On Camera, Union Minister's "Beat With Belt" Threat For Officials in Chhattisgarh

అధికారులతో దురుసుగా ప్రవర్తిసున్నారంటూ కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... దిలీప్ గుప్తా అనే వ్యక్తి క్వారంటైన్ కేంద్రంలో వసతులు సరిగా లేవని ఫిర్యాదు చేశాడు.

దీనిలో భాగంగా అక్కడి పరిస్ధితులను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇది ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో కేంద్ర గిరిజన శాఖ సహాయక మంత్రి రేణుకా సింగ్ ఆదివారం బల్రాంపూర్‌లో ఉన్న కరోనా క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ నేపథ్యంలో అక్కడి వసతుల గురించి ఆరా తీసిన ఆమె.. అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాగిరి తన వద్ద చెల్లదంటూ వారిని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలో లేదని ఎవరు భావించొద్దన్న ఆమె.. తాము 15 సంవత్సరాలు పాలించామని చెప్పారు.

Also Read:జూన్‌లో కరోనా కేసులు మరింత తీవ్రమయ్యే ఛాన్స్: నిపుణుల వార్నింగ్

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద కావల్సినంత డబ్బు ఉందని.. అందువల్ల ప్రజలకు కావాల్సిన వాటిని సమకూర్చాలని రేణుకా సింగ్ తెలిపారు. కాషాయ కండువా ధరించిన బీజేపీ కార్యకర్తలు బలహీనులని భావించకండి.. మాట వినని వారిని గదిలో బంధించి బెల్టు తీసుకుని ఎలా కొట్టాలో తనకు బాగా తెలుసు జాగ్రత్త అంటూ ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు రేణుకా.

ఈ తతంగాన్ని దీలిప్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రేణుకా సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని  రేపుతున్నాయి. దీనిపై దీలిప్ మాట్లాడుతూ... కొన్ని రోజుల క్రితం తాను ఢిల్లీ వెళ్లి వచ్చానని తెలిపాడు.

Also Read:జాక్‌పాట్ కొట్టాడు: రూ. 30 వేలను కోల్పోయిన మూడు రోజుల్లోనే రూ. 8 లక్షలు

కోవిడ్ 19 నేపథ్యంలో బల్రాంపూర్ క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్నానని.. ఇక్కడ వసతులు సరిగా లేవని, మంచి ఆహారం పెట్టడం లేదని వివరిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో అధికారులు తన మీద ఆగ్రహం వ్యక్తం చేశారని.. తన జుట్టు పట్టుకు లాగారని వీడియోను డిలీట్ చేశారని చెప్పాడు. కానీ ఈ లోపే రేణుకా సింగ్ ఈ వీడియోను చూడటంతో ఆమె క్వారంటైన్ కేంద్రానికి వచ్చి తమతో మాట్లాడారని.. ఈ సమయంలోనే కేంద్రమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని దీలిప్ వివరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios