నిందితుడిని ఓంకార్ తివారిగా గుర్తించారు. స్థానికులు దీనికి సంబంధించిన వీడియోని తీయగా... అది కాస్త వైరల్ గా మారింది. 

పెళ్లికి నిరాకరించిందిన 16ఏళ్ల మైనర్ బాలిక పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. కత్తితో బెదిరించి రోడ్డుపై జుట్టుపట్టుకొని లాక్కెల్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాయ్ పూర్ లో చోటుచేసుకోగా...పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 16 ఏళ్ల బాలికపై 47ఏళ్ల వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. పెళ్లికి నిరాకరించింది అనే కారణంతో... కత్తితో బెదిరించి మరీ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు. నిందితుడిని ఓంకార్ తివారిగా గుర్తించారు. స్థానికులు దీనికి సంబంధించిన వీడియోని తీయగా... అది కాస్త వైరల్ గా మారింది.

Scroll to load tweet…

ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా... ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) ప్రశాంత్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని గుధియారి ప్రాంతంలోని ఓంకార్ తివారీ కిరాణా షాపులో బాలిక పనిచేసింది.

తివారీ టీనేజ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నారని, అయితే ఆమె నిరాకరించి ఉద్యోగం మానేసిందని అగర్వాల్ చెప్పారు. ఎలాగైాన తనను పెళ్లి చేసుకోవాలని అతను... బాలిక ఇంట్లోకి చొరపడి.. జుట్టుపట్టుకొని లాక్కొచ్చాడు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉండటం గమనార్హం. బాలికపై కత్తితో దాడి చేసి మెడపై పొడిచాడు. ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ తివారీ ఆమెను వెంబడించి, ఆమె రోడ్డుపై కూలిపోయే వరకు ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.