Asianet News TeluguAsianet News Telugu

కిడ్నాపర్లతో పోట్లాడి చిన్నారిని రక్షించిన తల్లి, సీసీ కెమెరాల్లో దృశ్యాలు

నాలుగేళ్ల తన కూతురును కిడ్నాపర్ల నుండి  కాపాడుకొనేందుకు ఓ తల్లి పోరాటం చేసింది. చివరకు ఆమె పోరాటం ఫలించింది. కిడ్నాపర్ల బారి నుండి తన బిడ్డను కాపాడుకొంది.  ఈ దృశ్యాలను సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో మంగళవారం నాడు చోటు చేసుకొంది.

On Camera, Delhi Woman Fights Off Kidnappers To Save 4-Year-Old Daughter
Author
New Delhi, First Published Jul 23, 2020, 11:16 AM IST

న్యూఢిల్లీ: నాలుగేళ్ల తన కూతురును కిడ్నాపర్ల నుండి  కాపాడుకొనేందుకు ఓ తల్లి పోరాటం చేసింది. చివరకు ఆమె పోరాటం ఫలించింది. కిడ్నాపర్ల బారి నుండి తన బిడ్డను కాపాడుకొంది.  ఈ దృశ్యాలను సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో మంగళవారం నాడు చోటు చేసుకొంది.

 

తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో ఆయన లాభాలను ఆర్జించాడు. దీంతో అతని సోదరుడికి ఆయనపై ఈర్ష్య కలిగింది. అన్న నుండి డబ్బులు లాగాలని భావించాడు. దీనికి కిడ్నాప్ ప్లాన్ వేశాడు. 

తన సోదరుడి కూతురిని కిడ్నాప్ చేయాలని ఇద్దరికి సుఫారీ ఇచ్చాడు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులు  బైక్ పై మంగళవారం నాడు ఢిల్లీలోని వస్త్ర వ్యాపారి ఇంటికి చేరుకొన్నారు. మంచినీళ్లు కావాలని వస్త్ర వ్యాపారి భార్యను అడిగారు. మంచినీళ్లు తీసుకొచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లగానే ఇంట్లోని చిన్నారిని దుండగులు ఎత్తుకొని బైక్ వద్దకు వచ్చారు. 

మంచినీళ్ల గ్లాసుతో  బయటకు వచ్చిన వస్త్ర వ్యాపారి భార్య తన కూతురును దుండగులు ఎత్తుకెళ్తున్నారని గ్రహించింది. వెంటనే బైక్ వద్దకు పరుగెత్తి తన కూతురును తీసుకొనేందుకు కిడ్నాపర్లతో పోరాటం చేసింది. 

చిన్నారిని తల్లి తన చేతుల్లోకి తీసుకోగానే కిడ్నాపర్లు బైక్ పై పారిపోయారు.  అయితే నిందితులను పట్టుకొనేందుకు  స్థానికులు బైక్ ను వెంటాడారు. పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవి పుటేజీని పరిశీలించి దుండగుల నుండి చిన్నారిని కాపాడేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం రికార్డైంది. 

ఈ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వ్యాపారి సోదరుడిని కూడ పోలీసులు అరెస్టు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios