Asianet News TeluguAsianet News Telugu

Omicron Variant: పిల్లలపై ఒమిక్రాన్ ప్ర‌మాదం ఎక్కువే !

Omicron Variant:  డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంది. ఈ వేరియంట్ వ్యాప్తి చిన్న పిల్ల‌ల్లో కూడా క‌నిపిస్తోన్నాయ‌ని, పిల్ల‌ల్లో రోగ లక్షణ పెరుగుతున్నందున ఒమిక్రాన్ వేరియంట్‌తో ఆజ్యం పోసిన పిల్లలలో కోవిడ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
 

Omicron Leads To Greater Risk Than Delta Variant In Kids
Author
Hyderabad, First Published Jan 17, 2022, 1:01 AM IST

Omicron Variant:  ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’  భార‌త్ లోనూ త‌న పంజా విసురుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 5 వేల‌కు పైగా.. కేసులు న‌మోద‌వయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు మళ్లీ బెంబేలెత్తడం మొదలుపెట్టారు. అయితే.. ఈ క్ర‌మంలో ఒమిక్రాన్ వేరియంట్ చిన్న పిల్ల‌ల‌పై ఏ విధంగా ప్ర‌భావితం చూపుతోందనే ప్ర‌శ్న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. 

Omicron వేరియంట్ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి తగినంత డేటా ఇంకా ప్రాసెస్ చేయబడలేదు, కానీ ఇటీవల ఢిల్లీలోని చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జనవరి 9-12తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. దీంతో క‌రోనా వైర‌స్ చిన్న పిల్లలపై ప్రభావం అంతగా చూపించదనే మాటను పక్కకుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలను కరోనా నుంచి కాపాడుకోవడానికి అదనపు భద్రత పెరిగింది.

డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉంటుంద‌నే  నిర్లక్ష్యం వ‌హించ‌డానికి వీల్లేదు. చిన్నపిల్లల్లోనే కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. చిన్న పిల్ల‌లు ఎక్కువ శాతం.. తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నారు. ఒమిక్రాన్ లక్షణాలతో సతమతమవుతున్నారని  డాక్టర్ ఫజల్ నబీ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, వోకార్డ్ హాస్పిటల్ చెప్పారు.


5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రమాదం ఉందా?  

నిపుణుల అభిప్రాయం ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్ల‌లు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్ప‌టికే దక్షిణాఫ్రికాలో, 5 ఏండ్లలోపు పిల్లలు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగింది. ఈ వేరియంట్ ప్ర‌భావం పిల్లలపై ఎక్కువగా ఉన్న‌ట్టు కనిపిస్తోంది. ఇది డెల్టా వేరియంట్ లాగా  బ‌య‌ట‌కు కనిపించలేదనీ, చాప కింద నీరులాగా వ్యాపిస్తో..  ఆందోళన కలిగిస్తుంది. అలాగే.. 5 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ కూడా విస్తృతంగా జరగకబోతుండటంతో రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద వాళ్లలో లక్షణాలు కనిపించకపోగా వారిలో ఇబ్బందులు తక్కువగానే ఉంటున్నాయి. అదే పిల్లల్లో వాంతులు, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

ఈ క్ర‌మంలో క‌రోనా నిబంధ‌న‌లను క‌ఠిన‌త‌రం పాటించాల‌ని సూచిస్తోన్నారు వైద్య నిపుణులు. బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోకుండా పిల్లలను ముట్టుకోవడం, కొవిడ్ అనుమానంతో ఉన్నా వారితో చనువుగా ఉండటం, ఇంట్లో పెద్దలు బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించకపోవడం వంటివి పిల్లలపైనా ప్రభావం చూపిస్తాయనే విషయం మర్చిపోవ‌డం వంటి నిర్ల‌క్ష్యలు చేయ‌కూడ‌ద‌ని వైద్యులు తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2, 71, 202 కేసులు నమోదయ్యాయి. అదే స‌మ‌యంలో క‌రోనా కు 314 మంది బ‌లి అయ్యారు. ప్ర‌స్తుతం  యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల 50 వేలు దాటింది. అలాగే.. డెయిలీ పాజిటివిటీ రేటు 16.28 శాతానికి పెరిగింది. అందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 వేల 743కి చేరింది. తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో.. దాదాపుగా అన్ని రాష్ట్రాలూ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు వచ్చిందని వైరాలజిస్టులు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios