Asianet News TeluguAsianet News Telugu

కాలేజీలో అడుగుపెట్టాలంటే.. గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిందే.. లేదంటే కఠిన చర్యలు

యూనివర్శిటీ విద్యార్థులందరూ బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌తో రావడం తప్పనిసరి చేశారు. ఈ నియమాన్ని ఎవరు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

OMG! Action will be taken against students without girlfriend or boyfriend in this Chandigarh university; here's fact behind the story
Author
Hyderabad, First Published Aug 27, 2018, 2:57 PM IST

రేపు కాలేజీకి వచ్చేటప్పుడు అబ్బాయిలంతా తమ గర్లఫ్రెండ్స్ ని.. అమ్మాయిలంతా తమ బాయ్ ఫ్రెండ్స్ ని కచ్చితంగా వెంట తీసుకొని రావాలి. అలా కనుక రాకపోతే.. కఠిన చర్యలు ఉంటాయి. ఇలాంటి స్టేట్ మెంట్ ఏ కాలేజీ అయినా ఇస్తుందా..? కానీ ప్రస్తుతం నెట్టింట ఓ కాలేజీ నుంచి ఇలాంటి సర్క్యులర్ వచ్చిందని ఓ లెటర్ వైరల్ గా మారింది. ఆ లెటర్ చూసినవారంతా షాకయ్యారు. 

విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు.. కాలేజీ యాజమాన్యం కూడా షాకయ్యింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...చండీగఢ్ యూనివర్శిటీ‌కి చెందిన సీయూ మేనేజిమెంట్ నుంచి వచ్చిన ఒక లెటర్ ఇప్పడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ లెటర్‌లో ఎంతో ఆసక్తికర విషయం ఉండటమే దీనికి కారణం. 

 ఈ లెటర్‌లో పేర్కొన్నదాని ప్రకారం ఆగస్టు 13 తరువాత యూనివర్శిటీ విద్యార్థులందరూ బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌తో రావడం తప్పనిసరి చేశారు. ఈ నియమాన్ని ఎవరు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. కాగా యూనివర్శిటీ అధికారులు ఈ లేఖ విషయమై విచారించగా అది తప్పుడు సమాచారమని తేలింది.

 దీంతో ఈ లేఖను రూపొందించిన విద్యార్థిని యూనివర్శిటీ నుంచి తొలగించారు. యూనివర్శిటీకి చెందిన స్టూడెంట్స్ వెల్ఫేర్ డైరెక్టర్ అరవిందర్ సింగ్ కంగ్ పేరుతో సీయూ లెటర్ హెడ్ మీద సదరు విద్యార్థి ఈ లెటర్ రూపొందించి, సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios