భర్త మీద తనకు ఉన్న అమితమైన ప్రేమ కారణంగా.. తన ప్రాణాలను కూడా పణంగా పెట్టింది ఓ మహిళ. భర్త చితిలోనే తన ప్రాణాలను కూడా వదలాలనుకుంది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బందా జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూశాడు. కాగా.. ఆయన సతీమణి(70).. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. భర్త అంత్యక్రియల్లోనూ అతని చితిలోనే తాను కూడా ప్రాణాలు వదలాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని ఆమెను అడ్డుకున్నారు.

దీని గురించి పోలీసులు మాట్లాడుతూ... ఇలాంటి సంఘటనలు చట్టానికి విరుద్ధమన్నారు. సతీసహగమనం కావడం ఆ వృద్ధురాలి కోరిక అని.. అయితే.. దానిని తాము అంగీకరించమని చెప్పారు. ఆవిడపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని  చెప్పారు. ప్రస్తుతం ఆవిడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.

పూర్వం..భర్త చనిపోతే.. అతని చితిలోనే ఇష్టం ఉన్నా లేకున్నా.. భార్యలను కూడా సజీవదహనం చేసేవారు. కాగా.. ఈ సంప్రదాయానికి నిషేధం విధించారు.