ప్రతీక్ అరోరా అనే డిజిటల్ ఆర్టిస్ట్ ఓల్డ్ ఢిల్లీని ఏఐ కళ్లతో చూపించారు. మిడ్‌జర్నీ అనే ఏఐ సాఫ్ట్‌వేర్ రూపొందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఓల్డ్ ఢిల్లీ పేరు చెప్పగానే ఇరుకైన మురికి దారులు, పాత ఇళ్లు, చీకటిగా ఉండే సందులు, విద్యుత్ తీగలు కళ్ల ముందు మెదులుతాయి. అక్కడ సందడిగా ఉండే మార్కెట్ లు, నోరూరించే స్ట్రీట్ ఫుడ్ లను అందరూ ఇష్టపడతారు. ఆ ప్రదేశానికి వెళ్లిన ఎవరైనా మళ్లీ ఆ ప్రాంతంలో తిరగాలని కోరుకుంటారు.

Scroll to load tweet…

అయితే ప్రతీక్ అరోరా అనే డిజిటల్ ఆర్టిస్ట్ ఆ ప్రాంతానికి సంబంధించిన ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపొందించారు. వాటిని ట్విటర్లో షేర్ చేశారు. ఈ చిత్రాలు పాత ఢిల్లీలోని 'దివంగత' ప్రజలు ఎలా ఉండేవారో చూపిస్తున్నాయని ‘ఇండియా టుడే’ కథనం నివేదించింది. ఈ ఫొటోలను చూస్తే కచ్చితంగా వెన్నులో వణుకుపుడుతుంది. అయితే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Scroll to load tweet…

ఈ ఫొటోలను చూస్తే పారానార్మల్ జీవుల మనం నడుస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. మిడ్‌జర్నీ అనే ఏఐ సాఫ్ట్‌వేర్ ద్వారా చిత్రాలను రూపొందించారు.

Scroll to load tweet…

ఈ పోస్టుకు 29 వేలకు పైగా వ్యూస్, టన్నుల కొద్దీ రియాక్షన్స్ వచ్చాయి. ఆ ఫొటోలు ఎంత భయంకరంగా ఉన్నాయో ప్రజలు వ్యక్తం చేశారు. హారర్ కథల్లోని పాత్రలను ఈ చిత్రాలు గుర్తు చేస్తున్నాయని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. 

Scroll to load tweet…

అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న గాలి నాణ్యత వల్ల ఢిల్లీ నివాసితులు ఏఐ ద్వారా రూపొందించిన ఫొటోల్లో ఉన్నవారి లాంటి పరిస్థితినే ఎదుర్కొంటారని ఒక యూజర్ చమత్కరించారు.