డివైడర్ ను ఢీకొని బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. ఫ్లైఓవర్ పై భారీ అగ్నిప్రమాదం.. వీడియో వైరల్
పంజాబ్ (Punjab)లోని లుథియానా (Ludhiana)లో ఓ ఆయిల్ ట్యాంకర్ డివైడర్ (oil tanker hits divider)ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఖన్నా బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ (flyover)పై ఈ ఘటన జరిగింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
oil tanker hits divider : పంజాబ్ లోని లుధియానాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖన్నా ప్రాంతానికి సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద బుధవారం ఓ అయిల్ ట్యాంకర్ డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. కొంత సమయం తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. దీని వల్ల దట్టమైన, నల్లటి పొగలు ఆకాశంలోకి వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత ఆశా.. ఎంత క్యూట్ గా ఉన్నాయో.. (వీడియో)
ఈ ప్రమాదం వల్ల ఫ్లైఓవర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీనిపై సమాచారం తెలిసిన వెంటనే నాలుగైదు అగ్నిమాపక యంత్రాలు, సివిల్, పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరిగినట్లు సమాచారం లేదు.
ఈ అగ్నిప్రమాదంపై ఎస్ఎస్పీ ఖన్నా అమ్నీత్ కొండల్ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ పై డివైడర్ ను ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగినట్లు మధ్యాహ్నం 12.30 గంటలకు తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే 4-5 అగ్నిమాపక యంత్రాలతో పాటు సివిల్, పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ట్రాఫిక్ ను దారి మళ్లించినట్లు ఆయన వెల్లడించారు.