Oil Tanker: ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ఓ నదిలో ఆయిల్ ట్యాంకర్ పడింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్‌లో ఉన్న నలుగురు మృతి చెందారు. నయాగఢ్ జిల్లా పండుసురా వంతెన వద్ద ప్రమాదం జరిగింది. పారాదీప్ నుంచి నయాగఢ్‌కు ఆయిల్ ట్యాంకర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Oil Tanker: ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఆయిల్ ట్యాంకర్.. పారదీప్ నుంచి నయాగఢ్ వెళ్తున్నది. ఈ క్రమంలో నయాగఢ్ జిల్లాలోని ఇటమటి వద్ద బడా పాండుసార వంతెన దగ్గర జరిగింది. ప్రమాదశాత్తువు వంతెనపై నుంచి ఆయిల్ ట్యాంకర్ పడిపోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను పంకజ్ నయాజ్, దీపు ఖతువా, సమీర్ నాయక్, చందన్ ఖతువాగా గుర్తించారు. వీరంతా స్థానికులు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని తొలుత నయాగఢ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం భువనేశ్వర్ లోని కటక్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల నివేదికల ప్రకారం.. తెల్లవారుజామున 1.45 గంటలకు పారాదీప్ నుండి ట్యాంకర్ వస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్యాంకర్ వంతెనపై నుంచి కిందపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా పూర్తిగా ఆయిల్ నింపిన ట్యాంకర్ పేలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న నలుగురు స్థానికులు కాలి బూడిదయ్యారు.
పేలుడు ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నయాగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో భువనేశ్వర్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారందరూ అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
